కస్తూరిబా గురుకుల కళాశాల భవనానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
పెద్దమందడి,నవంబర్21(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి కస్తూరిబా గురుకుల జూనియర్ కళాశాల నూతన భవనానికి శుక్రవారం వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ.. నూతన భవనం విద్యార్థులకు మరింత సౌకర్యవంతమైన విద్యాసౌకర్యాలను అందించేలా రూపకల్పన చేయడం జరుగుతుందని తెలిపారు. భవన నిర్మాణం పూర్తయిన తర్వాత విద్యార్థులు తరగతులు, ల్యాబ్‌లు మరియు ఇతర విద్యా సంబంధిత కార్యకలాపాలను సౌకర్యవంతంగా నిర్వహించగలుగుతారని ఆయన తెలిపారు. కస్తూరిబా జూనియర్ గురుకుల కళాశాలకు భవనం మంజూరు చేయడం పట్ల విద్యార్థలు, విద్యార్థుల తల్లిదండ్రులు, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments