రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు శ్రీజ ఎంపిక

రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు శ్రీజ ఎంపిక

కొమురం భీం,ఆగస్టు22(తెలంగాణ ముచ్చట్లు):

కొమురం భీం జిల్లా గోలేటి టౌన్షిప్ వేదికగా జరగనున్న 71వ సీనియర్ రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ మహిళల ఛాంపియన్‌షిప్ కు జాగృతి ఉమెన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థిని మ్యాదరబోయిన శ్రీజ ఎంపికయ్యారు. బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్న శ్రీజ రాష్ట్రస్థాయిలో పాల్గొనే అర్హత సాధించడం కళాశాల వర్గాల్లో ఆనందం నింపింది.

ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ ఎల్ది మహేందర్, డైరెక్టర్స్ ఎల్ది రవీందర్, దావు శ్రీనివాస్ రెడ్డి, ఏ. సునీల్, ఎల్ది రాజు, ప్రిన్సిపాల్ ఎల్. ఉమాపతిరావు, ఫిజికల్ డైరెక్టర్ శ్రీధర్ల కుమారస్వామి, లెక్చరర్లు ఏ. చిరంజీవి, చిట్యాల నరేష్, హెచ్. శ్రీకాంత్, జి. వీరాచారి, ఎ. కృష్ణ, మంజుల ఆమె విజయంపై హర్షం వ్యక్తం చేశారు.వారు మాట్లాడుతూ శ్రీజ కృషి, క్రీడాస్ఫూర్తి రాష్ట్రస్థాయి పోటీల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.

 

Tags:

Post Your Comments

Comments

Latest News

ఇంట్లో నిద్రిస్తున్న తల్లీకూతుళ్లపై పాము కాటు. ఇంట్లో నిద్రిస్తున్న తల్లీకూతుళ్లపై పాము కాటు.
సత్తుపల్లి, ఆగస్టు 28 (తెలంగాణ ముచ్చట్లు): మండలంలోని చిన్నపాకల గూడెం గ్రామంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్న దుర్ఘటన గ్రామాన్ని విషాదంలో ముంచేసింది. ఇంట్లో నిద్రిస్తున్న తల్లీకూతుళ్లపై పాము...
డ్రైనేజీ సమస్యతో శివ సాయి నగర్ వాసుల ఆవేదన.!
సత్తుపల్లిలో గణపతి పూజల్లో ఎమ్మెల్యే మట్టా రాగమయి దంపతులు.
కాలి దప్పి మాట్లాడుతున్న కడియం 
మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఘనంగా ప్రారంభం
అధికారంలో ఉన్నా లేకున్నా సుధాకర్ రెడ్డి ఎప్పుడూ  సిద్ధాంతాన్ని వదల్లేదు
బయోటెక్నాలజీ,మెడికల్ టెక్నాలజీ రంగాల్లో ఆవిష్కరణలకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం