బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన
మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు.
చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలును సోమవారం ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ , టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ,మంత్రులు పొన్నం ప్రభాకర్ ,వాకిటి శ్రీహరి బొంతు రామ్మోహన్ ,మేడ్చల్ ఇంచార్జి వజ్రేష్ యాదవ్ తో పాటు ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి జెండా ఊపి రైలును ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో లింగోజిగూడ,చెర్లపల్లి,కాప్రా కార్పొరేటర్లు ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి,బొంతు శ్రీదేవి ,స్వర్ణరాజ్ శివమణి ,ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,డివిజన్ అధ్యక్షులు,కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments