పదవి విరమణ పొందిన ఏఎస్ఐ రాంరెడ్డి కి అభినందన
క్రమ శిక్షణ పాటిస్తూ...కుటుంబ సభ్యులతో విశ్రాంత జీవితం సంతోషంగా గడపాలి
వనపర్తి డిఎస్పి వెంకటేశ్వరరావు
వనపర్తి తెలంగాణ ముచ్చట్లు:
ఉద్యోగులకు పదవీ విరమణ తప్పదని వనపర్తి డిఎస్పి వెంకటేశ్వరరావు అన్నారు. పెద్దమందడి పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ గా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న రాంరెడ్డిని డిఎస్పి వెంకటేశ్వరరావు ఘనంగా సన్మానించారు. శుక్రవారం పెద్దమందడి పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఏఎస్ఐ రాంరెడ్డి పదవి విరమణ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. పదవి విరమణ వీడుకోలు సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... 35 సంవత్సరాలుగా రాంరెడ్డి పోలీస్ శాఖలో ఉద్యోగ నిర్వహణలో ఎలాంటి పని ఒత్తిడి లేకుండా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందడం గొప్ప విషయమని అన్నారు. పదవి విరమణ పొందిన సిబ్బందికి పోలీస్ శాఖ ఎల్లప్పుడు సహాయకంగా ఉంటుందని పేర్కొన్నారు. రాంరెడ్డి పోలీస్ శాఖలో చేసిన సేవలు మరువలేనిది అని రాంరెడ్డి నీ అభినందించారు.డి.ఎస్.పి గుర్తు చేశారు. పెద్దమందడి ఎస్సై శివకుమార్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది తో కలిసి ఏఎస్ఐ రాంరెడ్డి నీ ఘనంగా సన్మానించారు. విశ్రాంత జీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆయురారోగ్యాలతో జీవితం గడపాలని సూచించారు. శివకుమార్ మాట్లాడుతూ.. పదవి విరమణ అనంతరం సమాజానికి సేవలందించే దిశగా ముందుకు సాగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పి జె. వెంకటేశ్వర్ రావు, కొత్తకోట ఎస్ఐ ఆనంద్, పెద్దమందడి ఎస్ఐ ఈ. శివకుమార్, ఏఎస్ఐ బుచ్చన్న, హెడ్ కానిస్టేబుళ్లు ఆవులయ్య, రాజేందర్ రెడ్డి, దామోదర్, వెంకటస్వామి, లక్ష్మప్ప, కానిస్టేబుళ్లు అస్కాని బాలరాజు, శివరాములు గౌడ్, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాసులు, ఆనంద్, వెంకటేష్, చంద్రశేఖర్, నరేష్, రాకేష్, శ్రీనివాస్, భూపాల్ యాదవ్, రాధా, సాధికా బేగం, గ్రామస్తులు టైలర్ రవి, రాంరెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Comments