హరికిషన్ సింగ్ సుర్జిత్ 17 వర్ధంతి నివాళి చిత్రపటానికి పూలమాల
కాప్రా, తెలంగాణ ముచ్చట్లు:
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆధ్వర్యంలో ఆగస్టు 1వ తేదీన ఉదయం 11:30 గంటలకు కమలానగర్ జిల్లా పార్టీ ఆఫీసులో హరికిషన్ సింగ్ సుర్జిత్ 17 వర్ధంతి సందర్భంగా నివాళి కార్యక్రమం జరిగింది. జిల్లా పార్టీ సీనియర్ నాయకులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు. జిల్లా పార్టీ కమిటీ సభ్యులు ఎన్ శ్రీనివాస్ , జిల్లా పార్టీ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్న శోభ హరికిషన్ సింగ్ సుర్జిత్ చిత్రపటానికి పూలమాలలు వేసి రెడ్ సెల్యూట్ తెలిపారు. సీనియర్ నాయకులు గొడుగు యాదగిరి రావు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రభావంతమైన కృషిచేసి, కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు పునాది పురుషులైన నవరత్నాలలో హరికిషన్ సూర్జిత్ కీలకమైన స్థానంలో నిలిచారని చెప్పారు.
భారతదేశ రాజకీయాలలో ప్రభావితమైన నాయకుడిగా నిలిచారు. బిజెపి మతోన్మాద రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా సెక్యులర్ పార్టీలను కూడగట్టి నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ లను నిర్మించి రాజకీయాల్లో దేశాన్ని పరిపాలించే విధంగా ప్రధాన భూమిక నిర్వహించారని చెప్పారు.
అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీలతో అనుబంధాన్ని ఏర్పరచుకొని భారత కమ్యూనిస్టు ఉద్యమానికి వన్నె తెచ్చారని చెప్పారు. కార్మిక నాయకులు కేకే ఉన్నికృష్ణన్ మాట్లాడుతూ బాల్య దశలోనే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడారు అని చెప్పారు. సుభాష్ చంద్రబోస్ లాంటి విప్లవ యోధులను, సర్దార్ భగత్ సింగ్ యువ నాయకుల ఆదర్శాలను తీసుకొని పోరాడారు అని చెప్పారు. తర్వాత కాలంలో కమ్యూనిస్టు భావాలతో ప్రేరేపితుడై కమ్యూనిస్టుగా రూపొందారని చెప్పారు.
భారతదేశ రాజకీయాలలో బలీయమైన ముద్రను వేసిన గొప్ప నాయకుడు అని చెప్పారు. నేటి పరిస్థితుల్లో మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా సంఘటితంగా పోరాటాలు చేయాలని చెప్పారు. యువజన నాయకుడు బాబురావు కమిటీ సభ్యులు ఎన్ శ్రీనివాస్ ప్రసంగించారు. చివరగా సభ్యులందరూ చిత్రపటానికి పూలను వేసి రెడ్ సెల్యూట్ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వరరావు, గౌసియా, శోభ, బాబురావు బాబురావు తదితరులు పాల్గొన్నారు.
Comments