1 కోటి 7 లక్షల 50 వేల రూపాయ లతో అభివృద్ధి పనుల కు శంకుస్థాపన
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్
చిల్కానగర్, తెలంగాణ ముచ్చట్లు:
చిల్కానగర్ డివిజన్ లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ డివిజన్ లోని పలు కాలనీలో బస్తీల్లో 1 కోటి 7 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ తో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.
కళ్యాణ్ పూరి లోని ఇందిరా నగర్, జాహిద్ నగర్ లో మరియు బీరప్ప గడ్డలో భూగర్భ డ్రైనేజీపనులు ఈస్ట్ కళ్యాణపురిలో బ్యాలెన్స్ కమ్యూని టీ హాల్ వర్క్ పనులకు రాఘవేంద్రనగర్ కాలనీ చిల్కానగర్ బొడ్రాయి
వెనకాల వీధిలో సిసి రోడ్ల పనులకు
చిలుకా నగర్ మరాలా మైసమ్మ ఆలయం వద్ద స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ చిల్కానగర్ డివిజన్లో దశలవారీగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ అహర్నిశలు ప్రజలలో ఉంటూ ప్రజలతో మమేకమై బస్తీలలో కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు అహర్నిశలు కృషి చేస్తున్నారని వారిని అభినందిస్తు న్నానని కొనియాడారు.కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ చిలుకనగర్ డివిజన్లో గత నాలుగున్నర సంవత్సరాలలో సుమారు 98 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయని, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నుండి చిల్కానగర్ డివిజన్ కి ఎనలేని నిధులు వస్తున్నాయని చిలుక నగర్ డివిజన్ పట్ల వారు ప్రత్యేక చొరవ చూపుతున్నందుకు వారికి అభినందనలు తెలుపుతున్నామని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులు డిఈ వెన్నెల గౌడ్, ఏఈ రాధిక, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కాలనీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వారి కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున బస్తివాసులు పాల్గొన్నారు.
Comments