లే అవుట్ లోని ఖాళీ స్థలం కబ్జా?
పట్టించుకోని దమ్మాయిగూడ మున్సిపల్ అధికారులు
దమ్మాయిగూడ, తెలంగాణ ముచ్చట్లు:
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని చీర్యాల్‌లో గల ఓ లే అవుట్ లోని ఖాళీ స్థలం కబ్జాకి గురవుతోంది. సామాజిక కార్యక్రమాల కోసం వినియోగించా ల్సిన లేఔట్ లోని ఖాళీ స్థలాన్ని పక్కనే ఉన్న ప్లాట్ యజమాని ఆక్రమించి అక్రమంగా నిర్మాణం చేపడుతుంటే మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మున్సిపల్ పరిధిలోని చీర్యాల సర్వే నంబర్ 166 లేఅవుట్‌లో ప్లాట్ నెంబర్ 111 పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని ఆక్రమించి ఎలాంటి అనుమతులు లేకుండా జి+2 నిర్మాణం చేపడుతున్నారని కాలనీ వాసులు తెలిపారు.
సామాజిక అవసరాల కోసం వినియోగించాల్సిన లేఅవుట్ ఖాళీ స్థలాలను పరిరక్షించాల్సిన మున్సిపల్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. అక్రమ నిర్మాణం విషయమై, దమ్మాయిగూడ మున్సిపల్ అధికారులకు, ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని కాలనీ వాసులు మండిపడుతున్నారు.
ధర్మ బోధన చేయాల్సిన అర్చకుడే అక్రమ నిర్మాణం చేపడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సామాజిక అవసరాల కోసం వినియోగించవలసిన విలువైన ఖాళీ స్థలాన్ని కాపాడాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
Comments