సుప్రీం తీర్పు ప్రకారం స్పీకర్ తక్షణం నిర్ణయం తీసుకోవాలి – మాజీ ఎమ్మెల్యే రాజయ్య
ఘనపురం:
సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య తెలిపారు. ఆలస్యం చేయకుండా మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించిందని గుర్తు చేశారు.
“స్పీకర్ కాంగ్రెస్ నాయకుడిగా కాకుండా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలి” అని ఆయన స్పష్టం చేశారు.
రాజయ్య మాట్లాడుతూ, “రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ కోసం తిరుగుతుంటే, తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. కడియం శ్రీహరి నీతి నిజాయితీ ఉంటే రాజీనామా చేసి ప్రజా క్షేత్రంలోకి రావాలి. ప్రజలే నిర్ణయం తీసుకుంటారు” అన్నారు.
2014లో టిడిపి, 2018లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల విలీనాల గురించి మాట్లాడుతూ, “అప్పుడు ఎవరి ఇంటికీ కేసీఆర్ వెళ్లి కండువా కప్పి ఆహ్వానించలేదు. కడియం శ్రీహరి కూడా తనతో పాటు 25 మంది ఎమ్మెల్యేలతో వచ్చి మంత్రిగా అవుతానని భావించారు” అని రాజయ్య విమర్శించారు.
పార్టీ ఫిరాయించిన 10 మంది పై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments