దమ్మాయిగూడ జాతీయ మాల మహానాడు సంఘం అధ్యక్షులుగా 

అరిగే నాగరాజు నియామకం

దమ్మాయిగూడ జాతీయ మాల మహానాడు సంఘం అధ్యక్షులుగా 

దమ్మాయిగూడ, తెలంగాణ ముచ్చట్లు:

దమ్మాయిగూడ మున్సిపాలిటీ జాతీయ మాల మహానాడు సంఘం అధ్యక్షులుగా అరిగే నాగరాజు నియామకం. జాతీయ మాల మహానాడు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు జాతీయ మాల మహానాడు సంఘం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కన్వీనర్ గుజ్జుక పరశురాం ఆర్ జి కే కాలనీకి చెందిన అరిగే నాగరాజు ను దమ్మాయిగూడ మున్సిపాలిటీ జాతీయ మాల మహానాడు సంఘం అధ్యక్షులుగా ప్రకటిస్తూ నియామక పత్రాన్ని చైతన్య భూమి ప్రాంగణంలో మాల సంక్షేమ సంఘం కమిటీ సభ్యుల సమక్షంలో అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా నూతనంగా నియమించబడ్డ దమ్మాయిగూడ మున్సిపాలిటీ మాల సంఘం అధ్యక్షులు అరిగే నాగరాజు మాట్లాడుతూ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధనకై, రాజ్యాంగ పరిరక్షణకై మాల సంఘం ఉన్నతిని కాపాడుతూ నా జాతికి సేవ చేస్తానని తెలపడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆర్ జి కే కాలనీ మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు యాట రాజు,  అధ్యక్షులు అబ్బులు,ఆర్ జి కె కాలనీ డెవలప్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఉపాధ్యక్షులు రాజేంద్రప్రసాద్,ఆర్ జి కె కాలనీ డెవలప్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఆర్గనైజేషన్ సెక్రెటరీ,మాల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సానాది సాయిబాబ,కాలనీ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు  రాధాకృష్ణ , మాల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు  దుబాయ్ రాజు, కోశాధికారి చేన్నయ్య , ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు,మాల సంఘం కమిటీ సభ్యులు కె.వి రావు, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .