వర్షాకాలం ముందస్తు చర్యల్లో భాగంగా నాల్గవ విడత ప్రీమానుసూన్ స్పెషల్ డ్రైవ్
కాప్రా, తెలంగాణ ముచ్చట్లు:
జిహెచ్ఎంసి కమిషనర్ ఆదేశాల మేరకు జిహెచ్ఎంసి అంతట కొనసాగిస్తున్న,వర్షాకాలం ముందస్తు చర్యల్లో భాగంగా నాల్గవ విడత ప్రీమానుసూన్ స్పెషల్ డ్రైవ్ కాప్రా సర్కిల్ ఏఎస్ రావు నగర్ డివిజన్ గాంధీనగర్, శ్రీనివాస్ నగర్, లక్ష్మీపురం, బృందావన్ కాలనీ, అరుణ్ కాలనీ, త్యాగరాయ నగర్, అయోధ్య నగర్, రుక్మిణి పూరి ప్రాంతాల యందు ఈ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ అధికారులు సిబ్బంది ఈ కార్య క్రమంలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లపైన వచ్చిన ఇసుకమేటలను, పేరుకుపోయిన చెత్తను తొలగించ డం, గ్రీన్ వేస్ట్ తొలగించడం, జరిగింది రోడ్ల వర్షానికి రోడ్లపై ఏర్పడిన గుంత ల ను పూడ్చడానికి డిప్యూటీ కమిషనర్ జగన్ సంబంధిత అధికారులను చర్యలు తీసుకోవా ల్సిందిగాఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ జగన్,సి ఎం ఓ హెచ్ పద్మజ ఈ.ఈ నాగేందర్ డి.ఈ బాలకృష్ణ ఏ.ఈ కీర్తి శ్రీ టౌన్ ప్లానింగ్ డిసిపి కృష్ణ మోహన్, యు సి డి సెక్షన్ డిపిఓ దామోదర్ రెడ్డి,పారి శుద్ధ్య విభాగము ఏ ఎం ఓ హెచ్ మధుసూదన్ రావు సానిటరీ సూపర్వైజర్ సుదర్శన్ ఎంటమాలజీ ఏఈ రమేష్, సంబంధిత విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
ఈ యొక్క డ్రైవ్ ఆగస్టు 8 వరకు వివిధ వార్డుల యందు జరుగుతుందని డిప్యూటీ కమిషనర్ తెలియజేశారు. కుషాయిగూడ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ పద్మావతి మరియు టీచర్లు, విద్యార్థినీ విద్యార్థులు వారి పాఠశాల యందు ఈ సందర్భంగా పిచ్చి మొక్కలు తొలగించడం, చెత్తాచెదారాన్ని తొలగించడం జరిగింది.
ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు స్వచ్ఛభారత్ లో భాగంగా" సఫాయి అప్నాఓ భీమారి భగాఓ" కార్యక్రమాన్ని విద్యార్థులకు తెలియజేయడం లో భాగంగా ఈ సందర్భంగా జిల్లా పరిషత్ స్కూల్ కుషాయిగూడ విద్యార్థిని విద్యార్థులకు వర్షాకాలం వచ్చే అంటూ వ్యాధుల గురించి వ్యక్తిగత పరిశుభ్రత,ఇంటిపరిశుభ్రత,టాయిలెట్ల పరిశుభ్రత, నైబర్హుడ్ వారి పరి శుభ్రత ,నీటి వనరుల పరిశుభ్రత విషయమై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
పారిశుద్ధ్య సిబ్బందితోపాటు అంటువ్యాధులు ప్రబలకుండా వర్షాకాలంలో వర్షపు నీటి వలన ఎదుర్కొనే ముంపు ప్రాంతాలను ముందే గుర్తించి వర్షాకాలంలో ప్రభలే అంటు వ్యాధులను ముందస్తుగా అరికట్టేందుకు ఈ ఈ కార్యక్రమం జరుగుతుందని డిప్యూటీ కమిషనర్ జగన్ తెలియజేశారు.
Comments