భవాని నగర్ లో రెండేళ్లుగా ఆలస్యమైనా బాక్స్ డ్రైన్ పనులు ప్రారంభం

బాక్స్ డ్రైన్ నిర్మాణానికి అడ్డుగా ఉన్న విద్యుత్ స్థంబాలు తొలగింపు

భవాని నగర్ లో రెండేళ్లుగా ఆలస్యమైనా బాక్స్ డ్రైన్ పనులు ప్రారంభం

 నెమలి అనిల్ కుమార్

మల్లాపూర్, తెలంగాణ ముచ్చట్లు:

మల్లాపూర్ డివిజన్ భవాని నగర్ కాలనీలో కొద్దిరోజుల ముందు గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ నిర్వహించిన  బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా వెలువడిన సమస్య లో ప్రధాన సమస్యగా కాలనీ కమాన్ వద్దా రెండేళ్ల ముందు శంకుస్థాపన చేసిన బాక్స్ డ్రైన్ పనులు ఇంకా మొదలు కాకపోవడం తో కాలనీ ప్రజలు ఇబ్బంది పడ్తున్న  విషయాన్ని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి  మందముల పరమేశ్వర్ రెడ్డి  దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది.

తద్వారా కార్యనిర్వాహక ఇంజనీర్  నాగేందర్ ని జులై 16న నెమలి అనిల్  బృందం కలిసి వినతి పత్రాన్ని అందచేసిన విషయం తెలిసిందే,వెంటనే స్పందించిన అధికారులు శుక్రవారం రోజు బాక్స్ డ్రైన్ నిర్మాణానికి అడ్డుగా ఉన్న విద్యుత్ స్థంబాలను తొలగించి పనులను ప్రారంభించడం జరిగింది,

ఈ కార్యక్రమంలో మల్లాపూర్ ఎలక్ట్రికల్  నాగరాజ్ ,భవాని నగర్ కాలనీ అడ్వైసర్ శ్రీమన్నారాయణ ,వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ ,నాయకు లు నెమలి సురేష్ ,సురేష్ గౌడ్ ,పైళ్ల శ్రీనివాస్ ,సురేష్ ,పవన్ ,రంజిత్ ,అశోక్  తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .