విజిబుల్ పోలీసింగ్ తో ప్రజల భద్రతకు భరోసా,బలోపేతం చేయాలి

రాచకొండ సిపి సుధీర్ బాబు ఐపిఎస్

విజిబుల్ పోలీసింగ్ తో ప్రజల భద్రతకు భరోసా,బలోపేతం చేయాలి

మేడ్చల్, తెలంగాణ ముచ్చట్లు:

విజిబుల్ పోలీసింగ్ లో  భాగంగా  రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనీ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుంట్లూరు వద్ద మదర్ డెయిరీ ప్రాంతాన్ని రాచకొండ సిపి సుధీర్ బాబు ఐపిఎస్ పాల్గొని వాహనాలను తనిఖీ చేశారు.

అనంతరం అధికారులతో కలిసి పోలీసు పెట్రోలింగ్ చేస్తూ, స్థానిక ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి, పెట్రో కార్లు, బ్లూ కోల్ట్స్ పర్యవేక్షణ, ఆకస్మిక వాహన తనిఖీలు, మహిళా పోలీస్ సిబ్బంది సైకిల్ పెట్రోలింగ్ కార్యక్రమం వంటి విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాలపై ప్రశంసలు కురిపించారు.

ముఖ్యంగా డయల్ 100 అత్యవసర సేవలు, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930, లోన్ యాప్ మోసాలు, మాదకద్రవ్యాల వ్యతిరేక సందేశాలు, మహిళా భద్రతా చర్యలు, చైన్ స్నాచింగ్ మరియు మొబైల్ దొంగతనాల నివారణ, సైబర్ మోసాల అవగాహన, రోడ్డు భద్రతా చర్యలు వంటి అంశాలపై ప్రజలకు సిపి  అవగాహన కల్పించారుWhatsApp Image 2025-08-01 at 8.34.59 PM.

అనంతరం కోలన్ శివరెడ్డి నగర్‌లోని సీనియర్ సిటిజన్  బురగడ్డ అనంతాచార్యులు  నివాసాన్ని సందర్శించి వారితో కొద్దిసేపు ముచ్చటించారు. సీనియర్ సిటిజన్ల పట్ల పోలీసులు చూపిస్తున్న శ్రద్ధను ఆయన అభినందించారు.

హయత్‌నగర్ పోలీసులు చేపడుతున్న సైకిల్ పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ పర్యవేక్షణ, ఆకస్మిక వాహన తనిఖీలు వంటి విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాలు నేరాల నిరోధకతకు మరియు గుర్తింపుకు దోహద పడుతున్నాయని కమిషనర్  ప్రశంసించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .