ఇళ్లలోకి నాలా మురుగునీరు చేరి కాలనీ వాసులు ఇబ్బందులు జిహెచ్ఎంసి కి కనిపించదా

మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్

ఇళ్లలోకి నాలా మురుగునీరు చేరి కాలనీ వాసులు ఇబ్బందులు జిహెచ్ఎంసి కి కనిపించదా

మల్కాజిగిరి, తెలంగాణ ముచ్చట్లు: 

మల్కాజిగిరి డివిజన్, సర్దార్ పటేల్ నగర్ స్ట్రీట్ నెంబర్ 2 లో నాలా పై పైకప్పు (స్లాబ్) తొలగించి మరల నూతనంగా 40 ఫీట్ల వెడల్పుతో పైకప్పు(స్లాబ్) నిర్మిస్తున్నారు. దీనివల్ల వర్షాకాలంలో నీటి ప్రవాహం పెరిగి కాలనీ లోని స్ట్రీట్ నెంబర్ 1,2 & 3 లో ఉన్నటువంటి ఇళ్లలోకి నాలా లోని మురుగునీరు చేరి కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. 

గతంలో కార్పొరేటర్ గా పని చేసిన  నిరుగొండ జగదీష్ గౌడ్  ఈ నాల సమస్యపై ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు, కానీ ప్రస్తుత కార్పొరేటర్ శ్రవణ్ నాలాపై స్లాబు నిర్మించి సుమారు కాలనీలోని 100 నుండి 150 ఇళ్ల వరకు నష్టం కలిగించే విధంగా నాలాపై స్లాబ్ నిర్మాణం చేపడుతున్నారు. గతంలో ఇక్కడ ఉన్న డీ సి రాజు  ఎటువంటి స్లాబ్ నిర్మాణ పనులు చేపట్టవద్దని డిఈ, ఈఈ కి కాలనీవాసుల అభిప్రాయం మేరకు పని చేయాలని అధికారులకు సూచించారు కానీ ఇప్పుడు కొత్త డి సి రావడం తో అధికారులు ఆ విషయాన్ని  పెడచెవిన పెట్టి కాలనీలో నాలాపై స్లాబ్ నిర్మిస్తున్నారు.


శనివారం రోజు ఉదయం 11 గంటలకు జిహెచ్ఎంసి అధికారులు డిఈ.ఈఈ కాలనీలో సుమారుగా 20 మంది పోలీసులతో పహార పెట్టి  కాలనీవాసులను భయభ్రాంతులకు గురిచేసి, వారిని బెదిరించి నాలాపై స్లాబ్ నిర్మాణ పనులు చేపట్టారు. 
విషయం తెలుసుకున్న అక్కడికి చేరుకుని ఇదేమిటనీ మాజీ కార్పొరేటర్ కాలనీవాసులు ప్రశ్నించగా కాలనీ వాసులపై దౌర్జన్యంగా అక్రమ కేసులు పెడతామని బెదిరించారు.

మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్  జిహెచ్ఎంసి అధికారులతో మరియు పోలీసులతో మాట్లాడి నాలా సమస్యను సోమవారం రోజు జరిగే ప్రజావాణి కార్యక్రమానికి కాలనీ వాసులతో వెళ్లి కమిషనర్ తో  చర్చించి వారు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కమల్,జాకబ్, విశ్వనాథం, బాబన్న, శ్రీకాంత్, నీలం సతీష్,రాములు,విజయ్ ,జలాల్ భాయ్, రఘు ఇర్ఫాన్,జమాల్, మధుస్వాతి, పుష్పమ్మ,అనిత,నరసమ్మ, ఏమీనా,లలిత,అనురాధ,పద్మ,బుజ్జి,రాణి,
మానియమ్మ,స్వరూప,స్వప్న,మధు,ముంతాజ్,జయమ్మ,లేఖ,అనురాధ,శిల్ప పెద్ద ఎత్తున కాలనీ వాసులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-08-02 at 7.17.29 PM

Tags:

Post Your Comments

Comments

Latest News

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన 
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
మీనాక్షి నటరాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు గట్టు రాజు 
భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి నందుకు కార్పొరేటర్ కు సంతోషం వ్యక్తం చేసిన కాలనీవాసులు. 
బోనాల పండుగ ఉత్సవాల లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
దమ్మాయిగూడ జాతీయ మాల మహానాడు సంఘం అధ్యక్షులుగా 
50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు బాబా సాహెబ్ సన్నిధిలో 
మల్లాపూర్ అంబేద్కర్ సంఘం బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న