అన్నా రండి...! హార్ట్లీ వెల్కమ్....!!

తన క్యాంపు కార్యాలయానికి తొలిసారి విచ్చేసిన వాకిటికి ఘనస్వాగతం పలికిన పొంగులేటి

అన్నా రండి...! హార్ట్లీ వెల్కమ్....!!

ఖమ్మం,తెలంగాణ ముచ్చట్లు: 

అన్నా రండి...! హార్ట్లీ వెల్కమ్...!! అంటూ తొలిసారి ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన తెలంగాణ పశుసంవర్థక శాఖ మంత్రి, ఉమ్మడి ఖమ్మంజిల్లా ఇన్ చార్జి మంత్రిగా ఉన్న వాకిటి శ్రీహరికి తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఘనస్వాగతం పలికారు. కొత్తగూడెం నియోజకవర్గ పర్యటనను ముగించుకుని తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వెళ్తున్న వాకిటి శ్రీహరిని తన క్యాంపు కార్యాలయానికి రావాలని మంత్రి పొంగులేటి ఆహ్వానించారు. తన ఆహ్వానం మేరకు విచ్చేసిన వాకిటికి శాలువా కప్పి మెమోంటోతో ఘనంగా పొంగులేటి సత్కరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మంజిల్లా విశేషాలు మంత్రి పొంగులేటి శ్రీహరికి వివరించారు. పొంగులేటి ఆతిథ్యాన్ని స్వీకరించిన శ్రీహరి శీనన్న ఆతిథ్యం బేష్ అని కితాబిచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .