ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు కల్పించాలి

జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ 

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు కల్పించాలి

హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:

హనుమకొండ జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సంబంధిత శాఖలు సమిష్టిగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధ్యమైనంతవరకు సాధారణ ప్రసవాలు జరగేలా చర్యలు తీసుకోవాలని, సిజేరియన్ లు తగ్గించే దిశగా అవగాహన పెంపొందించాలని పేర్కొన్నారు.

హనుమకొండ కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమీక్ష సమావేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానలు, ఆర్‌బీఎస్‌కే, ఆరోగ్యశ్రీ, 108, టీహబ్‌ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డా. అ. అప్పయ్య జిల్లాలో జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాలు, సీజనల్ వ్యాధులపై వివరాలు అందించారు. ఆర్‌బీఎస్‌కే బృందాలు స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాల్లో అందిస్తున్న సేవలు, గుర్తిస్తున్న సమస్యలపై కలెక్టర్ సమీక్షించారు. గుర్తించిన రోగులకు ఫాలోఅప్ సేవలు అందించాలన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగేలా, సి-సెక్షన్లు తగ్గేలా చర్యలు తీసుకోవాలని, ఆరోగ్య మహిళా క్లినిక్స్ నుంచి రిఫర్ అయిన గర్భిణులకు తగిన ఫాలోఅప్ నిర్వహించాలని, రక్తహీనత కలిగిన గర్భిణులకు అవసరమైన చికిత్స అందించాలన్నారు.టీబీ ముక్త అభియాన్‌లో భాగంగా ఐ-రిస్క్ గ్రూపుల సభ్యులకు స్క్రీనింగ్, ఎక్స్‌రే, నాట్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఎన్సిడీ కార్యక్రమంలో గుర్తించిన బీపీ, షుగర్ రోగులు మందులు పద్దతిగా వాడుతున్నారా లేదో పర్యవేక్షించాలని, వారికి ప్రభుత్వ వైద్యం అందేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు.WhatsApp Image 2025-07-25 at 8.42.01 PM (1)

పని పనితీరు తక్కువగా ఉన్న ఉపకేంద్రాల్లో పర్యవేక్షణ మెరుగుపర్చాలని, అధికారులు తమ బాధ్యతల్ని సమర్థంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ మదన్మోహన్ రావు, ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ మహేందర్, టీబీ అధికారి డాక్టర్ హిమబిందు, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ అఖిల్, 108 కోఆర్డినేటర్ డెమో అశోక్ రెడ్డి, వివిధ ఆరోగ్య కేంద్రాల వైద్యులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన 
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
మీనాక్షి నటరాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు గట్టు రాజు 
భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి నందుకు కార్పొరేటర్ కు సంతోషం వ్యక్తం చేసిన కాలనీవాసులు. 
బోనాల పండుగ ఉత్సవాల లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
దమ్మాయిగూడ జాతీయ మాల మహానాడు సంఘం అధ్యక్షులుగా 
50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు బాబా సాహెబ్ సన్నిధిలో 
మల్లాపూర్ అంబేద్కర్ సంఘం బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న