యువతపై సోషల్ మీడియా ప్రభావం

సత్సంగం ఆధ్యాత్మిక జీవనానికి ఆక్సిజన్.

యువతపై సోషల్ మీడియా ప్రభావం

స్వామి తత్పదానంద మహారాజ్.

సత్తుపల్లి, తెలంగాణ ముచ్చట్లు:

యువత పెడదోవ పట్టకుండావారిని సక్రమ మార్గంలో నడపటానికి స్వామి వివేకానంద బోధనలు ఎంతగానో దోహదపడతాయని హైదరాబాద్ రామకృష్ణ మఠం స్వామీజీ తప్పదానంద మహారాజ్ పేర్కొన్నారు.

ఆదివారం సత్తుపల్లి శివారులో గల హ్యూమన్ ఎక్సలెన్స్ భవనం (వివేకానంద ప్రాంగణం)లో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మంచి ఆలోచనలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. తాగి తందనాలు ఆడటానికి బదులు సమయాన్ని సత్కర్మలకు ఉపయోగించాలని సూచించారు. తనను తాను తెలుసుకొని నలుగురికి ఉపయోగపడడానికి ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి అవసరమన్నారు. సత్సంగం ఆధ్యాత్మిక జీవనానికి ఆక్సిజన్ లాంటిది అన్నారు. సత్సంగం ద్వారా ఆత్మను ఉత్తేజ పరచడం, ఆనందం, సంతృప్తి, ప్రశాంతత లభిస్తుందన్నారు.
ప్రస్తుత సమాజంలో మనిషికి శీల సంపద ఎంతో అవసరం అన్నారు. సత్సంగం ఆత్మను ఉత్తేజపరుస్తుంది. మనలోని ఒంటరితనాన్ని పోగొడుతుంది, ప్రశాంతతను కలిగిస్తుంది అని వివరించారు. అన్ని మతాల సారాంశం ఆధ్యాత్మిక జీవనం, తోటి వారికి సహాయం చేయడమే అన్నారు.కార్యక్రమానికి ముందు భగవంతున మనన, స్మరణ, ధ్యానము, భజన కార్యక్రమాలు అలరించాయి.
  
ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ  భావ ప్రచార పరిషత్ తెలంగాణ మాజీ కన్వీనర్ సూర్య ప్రకాష్, యూవ ప్రచార పరిషత్ ఉపకన్వీనర్ పవన్, ఖమ్మం జిల్లా కన్వీనర్  కెఎస్ పి రాయ్, పాల్గొన్నారు. రామకృష్ణ సేవా సమితి సత్తుపల్లి నిర్వాహకులు చీకటి శ్రీనివాసరావు, చల్లగుల్ల శ్రీనివాస్, చల్లగుండ్ల అప్పారావు, గట్టే వాసు, ఆధ్యాత్మిక సంస్థలు, విద్యాసంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .