నాచారం డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు
కాప్రా, తెలంగాణ ముచ్చట్లు:
నాచారం డివిజన్‌లోని అన్నపూర్ణ కాలనీ కమ్యూనిటీ హాల్ ముందు సిమెంటు రోడ్డుకు రూ.50 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ పనులను ఉప్పల్ శాసనసభ్యుడు బండారి లక్ష్మారెడ్డి స్థానిక కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు భారీ సంఖ్యలో హాజరై, రోడ్డుపనులకు నిధులు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యేకు, కార్పొరేటర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. శాలువాలతో సత్కరించారు.
రాఘవేంద్రనగర్ అన్నపూర్ణ కాలనీలో ఇప్పటికే చాలా రోడ్లు కొత్తగా వేయించామని, ఈ సిమెంటు రోడ్డుతో చుట్టుపక్కల ప్రాంతాల రహదారి సమస్యలు తీరనున్నాయని కార్పొరేటర్ తెలిపారు. డివిజన్‌లో మిగిలిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఈ బాలకృష్ణ, ఏఈ వినీత్, స్థానిక ప్రజాప్రతినిధులు, బారస కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.
Comments