ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి

తెలంగాణ ఆత్మకు శతకోటి వందనాలు  ప్రొఫెసర్ జయశంకర్  ఆశయాలే మా మార్గదర్శకం 

ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి

కార్పొరేటర్ బన్నాల గీత

చిల్కానగర్, తెలంగాణ ముచ్చట్లు:

జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పని చేసిన ప్రొఫెసర్‌ జయశంకర్‌   జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించిన చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్.చిల్కానగర్ చౌరస్తాలో విశ్వ బ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ కె జయశంకర్  జయంతిని పురస్కరించుకొని  చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్  బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ఆయన చిత్రపటానికి  స్థానిక నాయకులతో కలసి పూలమాలలు వేసి ఘనంగా  నివాళులర్పించారు.  

కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, అసమానతలను ఎత్తిచూపుతూ, తెలంగాణ ప్రజలలో చైతన్య దివిటీ వెలిగించిన గొప్ప మేధావి ప్రొఫెసర్ జయశంకర్ . వలస పాలకుల చెరలో బందీ అయిన తెలంగాణ తల్లి విముక్తి కోసం ఆయన తిరగని ప్రాంతం లేదు.

సమస్త వనరుల సిరుల మాగాణ మైన తెలంగాణ యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని అనుక్షణం పరితపించారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ కి మార్గదర్శిగా. సమస్త తెలంగాణకు మార్గనిర్దేశకుడిగా ఆయన చేసిన కృషి సదా స్మరణీయం.తెలంగాణ ఆత్మగా నిలిచిన డా. జయశంకర్  చూపిన మార్గంలోనే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్  అభివృద్ధి చేశారని ఆయన ఆశయాలే మా ప్రేరణ. అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజం వేసిన గొప్ప నాయకుడు డా. కె. జయశంకర్  అని ఆయన జీవితమంతా తెలంగాణ ప్రజల హక్కుల కోసం అంకితం చేశారని తుది శ్వాస వరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన  నాయకుడు ఆయన ఆలోచనలు, శాస్త్రీయ విశ్లేషణలు, ఉద్యమ పటిమ, ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో ఆయన పాత్ర అపూర్వమైనది. ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను దేశం మొత్తం ముందుంచిన వ్యక్తి డా. జయశంకర్.
ఆయన ఆశయాలను కొనసాగిస్తూ, తెలంగాణకు సమగ్ర అభివృద్ధి తీసుకురావడమే ఆయనకు మనము అర్పించే నిజమైన నివాళి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో  బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, సీనియర్ నాయకులు ఎద్దుల కొండల్ రెడ్డి, ప్రతాపరెడ్డి, జనార్దన్ రెడ్డి , బలరాం  మేడ్చల్ జిల్లా సంఘం అధ్యక్షులు కృష్ణమాచారి, చిల్కానగర్  సంఘం అధ్యక్షులు సీతారామ చారి, అశోక్ చారి, ఎండి షఫీ, సదానంద్ చారి , సీతారామ చారి, నరసింహ చారి, లక్ష్మీనారాయణ చారి, నరసింహ చారి, రాజయ్య చారి, బాల చారి, ధనంజయIMG-20250806-WA0078 చారి,అశోక్ ముదిరాజ్, పాండు చారి, బ్రహ్మచారి, వీరాచారి, తిప్పరి శంకర్, తదితరులు పాలుగొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

చిలుక సత్యం సాగర్ ని సన్మానించిన బీసీ సమాజ్.. చిలుక సత్యం సాగర్ ని సన్మానించిన బీసీ సమాజ్..
మేడ్చల్, తెలంగాణ ముచ్చట్లు: జాతీయ మానవ హక్కులు మరియు సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్  ఎన్నికైన సందర్భంగా మంగళ...
జాతీయ మానవ హక్కులు , సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్
బిగ్ యూత్ అసోసియేషన్ పలహార బండి ఊరేగింపు 
కాంగ్రెస్ ప్రభుత్వం కపట ప్రేమతో బిసి రిజర్వేషన్ నిరసనలు  
క్రీడాకారుల కోచ్ లకు ప్రోత్సాహం అందించండి బొంతు శ్రీదేవి యాదవ్
ప్రపంచ శాంతి సంఘం ఆధ్వర్యంలో హీరోషిమా డే సామ్రాజ్యవాద వ్యతిరేక దినోత్సవం
పాత‌ కూర‌గాయ‌ల మార్కెట్‌కు రూ.55 ల‌క్ష‌ల నిధులు నిధులు మంజూరు