స్మశానవాటిక,శాంతినగర్ కమ్యూనిటీ హాల్ నిధులు మంజూరుపత్రాలను అందజేసిన
కార్పొరేటర్ రజితాపరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్, తెలంగాణ ముచ్చట్లు:
ఉప్పల్ డివిజన్ ముదిరాజ్ స్మశానవాటిక కు శాంతినగర్ అభివృద్ధికి మరో సారి భారీగా నిధులు మంజూరు చేయించినట్లుగా కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.కమ్యూనిటీ హాల్ బ్యాలెన్స్ పనులకు కొరకు రూ.15 లక్షలు, ముదిరాజ్ శ్మశాన వాటిక అభివృద్ధికి రూ.31 లక్షల నిధులు మంజూరు అయినట్టుగా చెప్పారు.
ఉప్పల్ ముదిరాజ్ సంఘం సభ్యుల కు,శాంతినగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి, ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి నిధుల మంజూరుకు సంబంధించిన ప్రోసిడింగ్ పత్రాలను అందజేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశా లతో ఉప్పల్ డివిజన్ కు భారీగా నిధులు మంజూరు చేయించిన ట్టుగా ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి, ఉప్పల్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తు న్నట్టుగా చెప్పారు.అందులో భాగంగానే ఉప్పల్ శాంతినగర్ కమ్యూనిటీ హాల్ , ముదిరాజ్ శ్మశానవాటిక కు సైతం నిధుల కేటాయింపు జరిగిందన్నారు.
ఇదే తరహాలో ఉప్పల్ నియోజక వర్గంలోని అన్ని ప్రాంతాలలో అభివృద్ధి పనులను చేపట్టినట్టుగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహంకాళి కృష్ణ, ఈగ అంజయ్య ,ఈగ లక్ష్మణ్,రాపాక వెంకటేష్, ఈగ సంతోష్ ,రాపాక నర్సింగ్, ఈగ బాబు,తలారి వెంకటేష్ ,ఈగ రాజేష్ ,మహంకాళి రాజు, తలారి జహంగీర్, తలారి విజయ్, కుక్కల విజయ్ ,తలారి వినయ్ పాల్గొన్నారు.
Comments