గ్రామాల లింక్ రోడ్లన్ని పూర్తి చేస్తాం
ఖమ్మం రూరల్ మండల పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
గ్రామాల్లో ప్రజల సౌకర్యార్థం రహదారుల నిర్మాణాలన్ని పూర్తి చేస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలో గురువారం పర్యటించి పలు రహదారుల నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు.
గోళ్లపాడు నుండి రామన్నపేట వరకు రూ. 3.52 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు, పల్లెగూడెం - మంగళగూడెం ఆర్&బి రోడ్డు నుండి ఊటవాగు తండా వరకు రూ. 75 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు పునఃనిర్మాణం పనులకు, మంగళగూడెం నుండి సర్వే నెం. 272 వరకు రూ.1.65 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్ నిర్మాణం, కొత్తూరు నుండి లకావత్ తండా వరకు రూ.2.20 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.... పాలేరు నియోజకవర్గంలో బురద లేని అంతర్గత రోడ్డు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కల్పిస్తామన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్ళుగా కొనసాగిస్తుందని అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. పేద ప్రజలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఉగాది నుండి రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా, ఆరోగ్య శ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు, మహిళలకు ఆర్టిసీ బస్సులో ఉచిత బస్ ప్రయాణం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఉగాది నుండి తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం అందిస్తున్నామన్నారు.
రూ. 22 వేల 500 కోట్లతో ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కల కోసం రూ. 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మొదటి విడతలో మంజూరు చేశామన్నారు. ఒఇంక మూడు విడుతలుగా ప్రతి సంవత్సరం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ఉంటుందని ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని అన్నారు.
ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఎవ్వరు అధైర్య పడవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామన్నారు.
ఇందిరమ్మ ప్రభుత్వం సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ అందించిందని మంత్రి తెలిపారు. రైతు భరోసా పథకం క్రింద పెట్టుబడి సహాయం ఎకరానికి రూ. 10 వేల నుంచి రూ. 12 వేల రూపాయలకు పెంచి, రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఎన్నో కార్యక్రమాలు అమలుచేసి, అర్హులకు అందజేస్తున్నామని, ఇంకనూ చేయాల్సివుందని ప్రభుత్వానికి అండగా నిలవాలని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ బాబు, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పీఆర్ ఎస్ఇ వెంకట్ రెడ్డి, మిషన్ భగీరథ ఇఇ వాణిశ్రీ, డిఇ మహేష్ బాబు, ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ రాంప్రసాద్, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Comments