సత్యనగర్ కాలనీలో రూ.కోటి 50 లక్షలతో పనుల పర్యవేక్షించిన
కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి, ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పరమేశ్వర్ రెడ్డి,
ఉప్పల్, తెలంగాణ ముచ్చట్లు:
ఉప్పల్ డివిజన్ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితా పరమేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో డివిజన్ అభివృద్ధికి కావాల్సిన నిధులను తెస్తూ పనులను చేపడుతున్నట్టుగా చెప్పారు. సత్యానగర్ కాలనీ లో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.కోటి 50లక్షల నిధులను మంజూరు చేయించి పనులను చేపట్టామన్నా రు. ఉప్పల్ డివిజన్ లోని సత్యా నగర్ కాలనీలో నిర్మాణం చేస్తున్న సీసీ రోడ్డుతో పాటు ఇతర అభివృద్ధి పనులను కాలనీ వాసులతో కలిసి ఉప్పల్ కార్పొరేటర్ మందముల రజితపరమేశ్వర్ రెడ్డి, ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ పరమేశ్వర్ రెడ్డి పర్యవేక్షించారు. డివిజన్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సమస్య పరిష్కారానికి రూ. 8 కోట్లతో సూపర్ సక్కర్ అనే యంత్రంతో పూడికతీత పనులను చేపట్టామని ఈ సందర్భం గా రజితా పరమేశ్వర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ తరహా పనులను ఉప్పల్ డివిజన్‌లోనే చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమం లో సత్యనగర్ కాలనీ అధ్యక్షులు కాటేపల్లి విజయ్ కుమార్,ఉపాధ్యక్షులు కుశంగళ సతీష్ ముదిరాజ్, జనరల్ సెక్రటరీ పోగుల సంజీవ్ రెడ్డి, ట్రెజరర్ శివ కుమార్,కుశంగళ వెంకటేష్ ముదిరాజ్, కృష్ణ మోహన్, చంద్ర శేఖర్, శివ రామ్, బీరప్ప, భాను, రాజు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈగ అంజన్న, లింగంపల్లి రామకృష్ణ, తుమ్మల దేవి రెడ్డి, సల్ల ప్రభాకర్ రెడ్డి,అలుగుల అనీల్ కుమార్, జనగాం రామకృష్ణ,భాస్కర్ రెడ్డి, వెంకట్ రెడ్డితదితరులు పాల్గొన్నారు.
Comments