న్యాయ పోరాటాలకు కాంగ్రెస్ కట్టుబాటు

ఏఐసీసీ లీగల్ సెల్ ఈవెంట్‌లో ఎంపీ వంశీకృష్ణ

న్యాయ పోరాటాలకు కాంగ్రెస్ కట్టుబాటు

న్యూ ఢిల్లీ

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఏఐసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఈవెంట్‌లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న వక్కీలు, లీగల్ నిపుణులు, కాంగ్రెస్ పార్టీ నేతలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ,
“దేశ ప్రజల హక్కుల రక్షణ కోసం న్యాయ పోరాటాలు తప్పనిసరి. అందుకోసమే లీగల్ సెల్ కృషి చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన న్యాయవాదులను ముందుకు తీసుకువెళుతోంది,” అని పేర్కొన్నారు.

అలాగే, న్యాయ వ్యవస్థ పటిష్టత, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటాలకు బలాన్నిచ్చేలా ఉందని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .