స్థానిక సంస్థల ఎన్నికల్లో సగరులకు అధిక సీట్లు కేటాయించాలి 

 సగర కళ్యాణ మండపం నిర్మాణం చేసే బాధ్యత నాది ఎమ్మెల్యే మేగారెడ్డి 

స్థానిక సంస్థల ఎన్నికల్లో సగరులకు అధిక సీట్లు కేటాయించాలి 

మేడ్చల్, తెలంగాణ ముచ్చట్లు:

వనపర్తి జిల్లా కేంద్రంలోని సంఘం ఫంక్షన్ హాల్ లో జిల్లా సగర సంగం ప్రమాణ స్వీకారంలో ముఖ్యఅతిథిగా వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లాల చిన్నారెడ్డి, పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు శేఖర్ సాగర్ మాట్లాడుతూ సాగరులను  బీసీ డీ నుండి బీసీ ఏలకు మార్చేలా కృషి చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ సాగర్ ఎమ్మెల్యేలను కోరారు. మరియు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సగరులకు అధిక సంఖ్యలో సర్పంచులు మరియు ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పిటిసి సీట్లు కేటాయించాలని కోరారు.

మొదటగా జిల్లా సగర సంగం అధ్యక్షుడిగా ఎన్నికైన మోడల తిరుపతయ్య సాగర్ నీ ఘనంగా శాలువా పూలమాలతో సన్మానించారు. మరియు ప్రధాన కార్యదర్శి కోశాధికారిని కూడా సన్మానించారు.ఈ సమావేశం ఉద్దేశించి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి మాట్లాడుతూ బీసీ డీ నుంచి బీసీలకు మార్చే విధంగా ముఖ్యమంత్రితో చొరవ తీసుకొని కృషి చేస్తానని తెలిపారు. వనపర్తి నల్లచెరువు మినీ ట్యాంక్ బండ్ పైన భగీరథ విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు అదే విధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సగరుల ప్రాతిపదికన సీట్లో కేటాయించి ఇస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా వనపర్తి జిల్లా గ్రంధాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్ ఇవ్వడం జరిగిందని తెలిపారు.WhatsApp Image 2025-07-27 at 7.40.04 PM (1)

దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ మా నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్నారని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు మరియు జెడ్పిటిసిలు మరియు మున్సిపల్ చైర్మన్ లకు అవకాశం కల్పిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. 

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నూతనంగా ఎన్నుకోబడిన జిల్లా సగర సంగం అధ్యక్ష కార్యదర్శులను శాలువా పూలమాలతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాల చైర్మన్ గోవర్ధన్ సాగర్ ,వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవ సత్యం సాగర్, జిల్లా ప్రధాన కార్యదర్శి గొబ్బూరి చంద్రయుడు సాగర్, జిల్లా కోశాధికారి గుంటి సత్యం సాగర్,రాష్ట్ర సగర సంగం గౌరవ అధ్యక్షులు ముత్యాల హరికృష్ణ సాగర్, రాష్ట్ర సగర సంగం ముఖ్య సలహాదారుడు ఆర్పి ఆంజనేయులు సాగర్, యాదాద్రి సగర సంగం అధ్యక్షులు కెపి రాములు సాగర్, యాదాద్రి సంఘం గౌరవ అధ్యక్షులు బంగారు నరసింహ సాగర్, సగర సంగం మాజీ కార్పొరేటర్ దేవరకద్ర బాలన్న సాగర్, రాష్ట్ర సగర సంగం ఉపాధ్యక్షులు చిలుక సత్యం సాగర్, యాదాద్రి సంఘం ఉపాధ్యక్షులు పల్లె సత్యనారాయణ, రాష్ట్ర సగర సంఘం సముక్త కార్యదర్శి విష్ణు సాగర్, గ్రేటర్ హైదరాబాద్ సగర సంగం అధ్యక్షులు రవి సాగర, గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రెటరీ ఆవుల వెంకట్ రాములు సగర, వనపర్తి జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రావుల నాగరాజ సగర, జిల్లా ఉద్యోగుల సంఘం వేముల రాములు సగర, రాష్ట్ర శారదగా మహిళా అధ్యక్షురాలు మహేశ్వరి సాగర్, వనపర్తి పట్టణ సాగర సంఘం అధ్యక్షులు చీర్ల గోవర్ధన్ సాగర్, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చీర్ల జనార్ధన్ సాగర్, వనపర్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చందర్ సాగర్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చీర్ల సత్యం సాగర్, పాన్గల్ మండల్ టిఆర్ఎస్ అధ్యక్షులు వీరాసాగర్, తదితరులు సాగర్ లు పాల్గొన్నారు...

Tags:

Post Your Comments

Comments

Latest News

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన 
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
మీనాక్షి నటరాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు గట్టు రాజు 
భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి నందుకు కార్పొరేటర్ కు సంతోషం వ్యక్తం చేసిన కాలనీవాసులు. 
బోనాల పండుగ ఉత్సవాల లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
దమ్మాయిగూడ జాతీయ మాల మహానాడు సంఘం అధ్యక్షులుగా 
50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు బాబా సాహెబ్ సన్నిధిలో 
మల్లాపూర్ అంబేద్కర్ సంఘం బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న