కుషాయిగూడ కూరగాయల మార్కెట్ లో బోనాల ఉత్సవాలు
మేడ్చల్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విఠల్ నాయక్
కుషాయిగూడ, తెలంగాణ ముచ్చట్లు:
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విఠల్ నాయక్ కుషాయిగూడ కూరగాయల మార్కెట్ లో బోనాల ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ- కూరగాయల మార్కెట్ వ్యాపారులకు, కుషాయిగూడ వాసులకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. అందరూ కలిసి మెలిసి, శాంతియుతంగా బోనాలు జరుపుకోవాలని సూచించారు. అమ్మవార్ల ఆశీస్సులతో సకాలంలో వర్షాలు కురిసి, పంటలు బాగా పండి రైతులు, వ్యాపారులు, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉండాలని అమ్మవార్లను ప్రార్తించానన్నారు.
మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పూర్ణ యాదవ్, కాప్రా డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పడమటి మల్లారెడ్డి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం లో కుషాయిగూడ మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి శాలువాలతో ఘనంగా సన్మానించారు. మార్కెట్ కమిటీ సభ్యులు సుధాకర్, వెంకటేష్, పి నర్సింహా రెడ్డి, రవి నాయక్, ఉప్పల లింగయ్య, కుమరయ్య, రమేష్ గౌడ్, యాదగిరి, రఘు, కె శ్రీను, లడ్డ, కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments