జువెనైల్ హోం నుంచి బాలలు తప్పించుకున్న ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం 

నిర్లక్ష్యంపై చర్యలు, అదనపు సిబ్బంది నియామకానికి ఆదేశాలు

జువెనైల్ హోం నుంచి బాలలు తప్పించుకున్న ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం 

హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:

సైదాబాద్ జువెనైల్ హోం నుంచి ఐదుగురు బాలలు మంగళవారం రాత్రి తప్పించుకున్న ఘటనపై బాలల సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఇప్పటికే ఇద్దరు సూపర్వైజర్లను విధుల నుంచి తొలగించగా, జువెనైల్ హోం సూపరింటెండెంట్‌కు మెమో జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జువెనైల్ హోంలో అదనపు సిబ్బందిని నియమించాలని మంత్రి సూచించారు.ఈ ఘటనపై జువెనైల్ వెల్ఫేర్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ చార్వాక్, అసిస్టెంట్ చీఫ్ ప్రొబేషన్ సూపర్వైజర్ నవీన్‌లు మంత్రిని సచివాలయంలో కలుసుకుని నివేదిక సమర్పించారు. తప్పించుకున్న ఐదుగురు బాలుల్లో ముగ్గురిని గుర్తించామని, మిగిలిన ఇద్దరిని గుర్తించేందుకు పోలీసుల సహాయం తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .