ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్న కాంగ్రెస్ నాయకులు
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
Views: 27
On
మల్కాజ్గిరి, తెలంగాణ ముచ్చట్లు:
మల్కాజ్గిరి నియోజకవర్గం లోప్రజా సంక్షేమం, శాంతి భద్రతల పరిరక్షణ బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
మల్కాజ్గిరి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే మరిరాజశేఖర్ రెడ్డి అభివృద్ధిని చూసి గౌతమ్ నగర్ కు చెందిన పలువురు కాంగ్రెస్ శ్రేణులు స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులను బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో టీ టైం వెంకటేష్, శ్రీనివాస్ కపూర్, ఎస్.సురేష్ .మెకానిక్. కుమారు , సాంబ తో పాటు పలువురు ఉన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బైరు అనిల్ తదితరులు ఉన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
04 Aug 2025 22:25:25
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
Comments