కూకట్‌పల్లి నియోజకవర్గ అభివృద్ధి పనులపై పర్యటన

ప్రాధాన్య రహదారి, బ్రిడ్జ్, క్రీడా ప్రాంగణాల ఏర్పాటుపై పరిశీలన

కూకట్‌పల్లి నియోజకవర్గ అభివృద్ధి పనులపై పర్యటన

కూకట్ పల్లి,తెలంగాణ ముచ్చట్లు:

కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్‌తో కలిసి నియోజకవర్గంలోని కెపిహెచ్‌బి, ఫతేనగర్ డివిజన్ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సమస్యల నివారణ, నగర అభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు.

వసంతనగర్ కాలనీ నుంచి గోకుల్ ఫ్లాట్స్ మీదుగా హైటెన్షన్ రోడ్డుపై రైలు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైన ప్రదేశాన్ని పరిశీలించారు. కూకట్‌పల్లి హుడా ట్రక్ పార్క్ ప్రాంగణాన్ని క్రీడా మైదానంగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనపై సమీక్ష జరిపారు. జేఎన్టీయూ సర్కిల్ వద్ద ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి స్కై వే ఏర్పాటుపై చర్చించారు.

అలాగే, మూసాపేట ఆంజనేయ నగర్ చౌరస్తా వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం, కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ మరియు అండర్‌పాస్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఫతేనగర్ వెంకటేశ్వరనగర్‌లో శిథిలావస్థలో ఉన్న పాత నడక బ్రిడ్జ్‌ను పునర్నిర్మించాలని సూచించారు.
పర్యటనలో కార్పొరేటర్లు మందాడి శ్రీనివాసరావు, పండాల సతీష్ గౌడ్, ఎస్.సీ. చిన్నారెడ్డి, ఈఈ రమేష్, డీఈ శంకర్, ఏఈ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .