పారిశుధ్య సిబ్బందికి రక్షణ పరికరాల పంపిణీ

ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా కిట్లు అందజేత

పారిశుధ్య సిబ్బందికి రక్షణ పరికరాల పంపిణీ

ఉప్పల్, తెలంగాణ ముచ్చట్లు:

ఉప్పల్ నియోజకవర్గంలోని డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలోని గ్రౌండ్‌లో జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాల కిట్లను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శిరీష సోమ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, నగర పరిశుభ్రతకై శ్రమించే పారిశుధ్య సిబ్బంది సేవలు అభినందనీయం అని పేర్కొన్నారు. వారి సేవను ఏంతగానైనా గౌరవించాల్సిన అవసరం ఉందని, ఒక రోజు కూడా శానిటేషన్ సిబ్బంది లేకపోతే నగర వాతావరణం ప్రభావితమవుతుందని చెప్పారు. పారిశుధ్య కార్మికులను ప్రతి ఒక్కరూ గౌరవంతో చూడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమ శేఖర్ రెడ్డి, శానిటేషన్ సిబ్బంది, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .