ప్రపంచ శాంతి సంఘం ఆధ్వర్యంలో హీరోషిమా డే సామ్రాజ్యవాద వ్యతిరేక దినోత్సవం
కాప్రా, తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూపు ప్రపంచ శాంతి సంఘం ఆధ్వర్యంలో హీరోషిమా డే సందర్భంగా సామ్రాజ్యవాద వ్యతిరేక దినోత్సవం కమలానగర్లో బుధవారం రోజు ఉదయం 11 గంటలకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు. రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశలో అమెరికా సామ్రాజ్యవాదం తన ఆధిపత్యంకై 1945 ఆగస్టు ఆరవ తేదీ అప్పటికే ఓటమిపాలైన జపాన్ దేశం హిరోషిమా నగరంపై అణుబాంబు వేయడం జరిగింది. 9వ తేదీన నాగసాకి నగరం పై కూడా అణు బాంబులు వేయటం జరిగింది. ఇది పూర్తిగా దుర్భాగము చర్యే కాకుండా లక్షలాదిమంది ప్రజలకు హాని కలిగించిన చరిత్ర అని అన్నారు. ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు కోమటి రవి మాట్లాడుతూ ప్రపంచంలో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కొరకు అణు బాంబులు హీరోషిమా నగరంపై వేసి,మొత్తం నగరాన్ని నేలమట్టం చేసిందని చెప్పారు. వేలాదిమంది ప్రజలు చనిపోవడం జరిగింది. లక్షలాదిమంది క్షతగాత్రులు అయ్యారు. ఇప్పటికీ మిగిలి ఉన్న ప్రజలు అణు ధార్మిక శక్తికి బలై అనేక రోగాలతో పట్టిపీడిస్తున్నాయని చెప్పారు. నేడు అమెరికన్ సామ్రాజ్య వాదం ప్రపంచాన్ని యుద్ధాల్లో ముంచేత్తుతుందని తమ ఆయుధాలు అమ్ముకోవడం కొరకు నిరంతరం యుద్ధాలను పురికొల్పుతుందని చెప్పారు. నేడు భారతదేశాన్ని కూడా దాన్ని ఊబిలోకి తీసుకు వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నదని చెప్పారు. అమెరికా సామ్రాజ్య వాదానికి దీటుగా చైనా తన అభివృద్ధిని కొనసాగించి అమెరికాకు చెక్ పెడుతున్నది. ప్రపంచ శాంతిని కాపాడుకోవడం కొరకు అందరూ ఏకమై సామ్రాజ్య వాద దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రపంచ శాంతి ప్రజలందరికీ చేకూర్చే సమాజాన్ని సాధించాలని కోరారు. ఈకార్యక్రమంలో కృష్ణమాచార్యులు, గిరీష్, శారద, జయ ప్రకాష్, భాస్కర్ రావు, చంద్రశేఖర్ తదితరులు ప్రసంగించారు. సామ్రాజ్యవాదం నశించాలి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, హీరోషిమా, నాగసాకి బాంబుల దాడులలో మరణించిన వారికి నివాళులు అర్పించారు.ఈకార్య క్రమంలో గుంటి లక్ష్మణ్, మంగ, గౌస్య, శారద, భాస్కర్, బాబురావు, చంద్రశేఖర్, కృష్ణమాచార్యు లు, భాస్కర్ రావు, ఆర్ఎస్ఆర్ ప్రసాద్, వెంకటేశ్వరరావు, గిరీష్ తదితరులు పాల్గొన్నారు.
Comments