ఆశా వర్కర్ల పెండింగ్ వేతనం వెంటనే విడుదల చేయాలి
మల్లాపూర్ అంబేద్కర్ భవన్‌లో ఆశా వర్కర్ల నిరసన
మల్లాపూర్, తెలంగాణ ముచ్చట్లు:
ఆశా వర్కర్లు పెండింగ్ లో ఉన్న వేతనం వెంటనే విడుదల చేయాలని మేడ్చల్ జిల్లా ఆశా వర్కర్ల యూనియన్ ప్రధాన కార్యదర్శి రేవతి కళ్యాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మల్లాపూర్ లోని అంబేద్కర్ భవన్ లో వేతనం వెంటనే విడుదల చేయాలని ఆశ వర్కర్లు నిరసనతెలిపారు. ఈ సందర్భంగా రేవతి కళ్యాణి మాట్లాడుతూ.వేతనాలుసమయానికి రాకుండా పెండింగ్ లో ఉంచడం వల్లన తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తీసుకెళుతు న్న మహిళలు, ప్రసూతి సేవలతో పాటు ఆరోగ్య కార్యకలాపాల్లో కీలకంగా పనిచేస్తున్నా, తమ కష్టానికి కనీస వేతనం 18వేలు ఇవ్వకపోగా, ఇచ్చే ఆరకోర వేతనాలు కూడా సమయానికి ఇవ్వకపోవడం బాధాకరం అన్నారు.కరోనా సమయంలో నూ,డెంగ్యూ,మలేరియా సీజన్ లోనూ మేమే ముందుండి పనిచేశాం. అయినా కూడా మాకు కనీస వేతనం ఇవ్వకుండా ప్రభుత్వం గడిపేస్తోంది. మాకు పని ఉంది, పేరు ఉంది. కానీ వేతనం లేదన్నారు. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
Comments