జ్ఞానానికి నిలయాలు గ్రంథాలయాలు

రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

జ్ఞానానికి నిలయాలు గ్రంథాలయాలు

హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు: 

జ్ఞానానికి నిలయాలు గ్రంథాలయాలు అని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరు లోని  అంచూరి ఫంక్షన్ హాలులో   ముల్కనూరు ప్రజా గ్రంథాలయం కథోత్సవం-2025  నమస్తే తెలంగాణ- ముల్కనూర్ WhatsApp Image 2025-07-27 at 8.36.12 PM (1)WhatsApp Image 2025-07-27 at 8.36.12 PMప్రజా గ్రంథాలయం, ముల్కనూర్ సాహితీ పీఠం సంయుక్తంగా జాతీయస్థాయి కథల పోటీల విజేతలు, కోడూరి రాజయ్య స్మారక క్విజ్ పోటీ విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని  నిర్వహించారు. 

 ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  మాట్లాడుతూ మారుతున్న కాలంలో సమాజంలో ఉన్నటువంటి చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియాలంటే చరిత్రను తెలుసుకోవాలన్నారు. ఇందుకు గ్రంథాలయాలు దోహదపడతాయన్నారు.  ముల్కనూర్ లోని  ప్రజా గ్రంథాలయం జ్ఞానానికి వేదిక నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఉందని, ప్రజా గ్రంధాలయాలు ఏర్పాటు ద్వారా సమాజ నిర్మాణానికి అంకురార్పణ చేయాలన్నారు. గ్రంథాలయం సమాజానికి ఉపయోగపడాలన్నారు. నేటి సమాజంలో బంధాలు తగ్గిపోతున్నాయని అన్నారు. సమాజంలో చిన్న చిన్న కారణాల వల్ల అనేక అనర్థాల వరకు  వెళ్తున్నారని పేర్కొన్నారు. ముల్కనూర్ ప్రజా గ్రంధాలయం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం  పోటీలను నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం అని తెలిపారు.  విద్యను అందుకు పుచ్చుకున్న వారు జీవితంలో ఎదిగారని అన్నారు. విద్యకు ఎవరూ కూడా దూరంగా ఉండవద్దని, చుట్టూ ఉన్న పిల్లలను పాఠశాలలో చేర్పించాలని కోరారు. సామాజిక స్పృహ ను కలిగి ఉండాలని అన్నారు.  గ్రంధాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తన వంతు సహకారాన్ని అందిస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రియాజ్ మాట్లాడుతూ కథోత్సవానికి 470 కథలు రావడం గొప్ప విషయం అన్నారు. ఇంత పెద్ద ఎత్తున కథలు రావడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. రాష్ట్రంలో ముల్కనూరు ప్రజా  గ్రంధాలయాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తెలుగు సాహిత్యానికి ముల్కనూరు వేదిక గా  నిలవడం స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. 

 ముఖ్యమంత్రి ఓ ఎస్ డి  వేముల శ్రీనివాసులు మాట్లాడుతూ సొంత ఊరికి సహాయపడాలనే ఉద్దేశంతో పలువురుతో కలిసి ప్రజా గ్రంథాలయం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.  మంత్రి పొన్నం ప్రభాకర్ రూ. 12లక్షలు గ్రంథాలయ అభివృద్ధికి మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. గ్రంథాలయంలో చదువుకున్న వారిలో దాదాపు 30మంది వరకూ వివిధ ఉద్యోగాలు సాధించారని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి కథోత్సవానికి హాజరయ్యారని తెలిపారు.  సాహిత్యానికి  ముల్కనూర్ సాహితీ పీఠం పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో కథోత్సవం ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజా గ్రంధాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులు యువతకు సూచించారు. 
ఇక్కడి యువత సివిల్స్ లో విజయం సాధించాలన్నారు. సాహిత్యం పట్ల మక్కువ పెంచుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి  
సాహిత్యంలో ముల్కనూర్ ను మోడల్ గా తీసుకెళ్లాలని సూచించారు. తెలుగు వారంతా ఒక్కటే అనే విధంగా కథోత్సవ పోటీలు నిర్వహించారని పేర్కొన్నారు. 

ప్రముఖ కవి అందెశ్రీ మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్రం కోసం పార్లమెంట్ లో గళమెత్తిన విషయం ఇంకా మనుసులో నిలిచి ఉందని, తన జీవితాంతం గుర్తుంచుకుంటానని పేర్కొన్నారు. ముల్కనూర్ సాహితీ రథచక్రం ముందుకు కదలాలని ఆకాంక్షించారు. సహకార సంఘం, డెయిరీ నిర్వహణ తో ఎంతో గుర్తింపును ముల్కనూర్ సాధించిందన్నారు. 
ములుకనూరు పేరు మొలకనూరు అని అన్నారు. సమాజంలో వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయని. అలాంటి వృద్ధులకు ప్రజా గ్రంథాలయం పొద్దుపొడుపు కావాలని ఆకాంక్షిచారు. ములుకనూరు ఎంతో గొప్ప ఊరు అని పేర్కొన్నారు. వివిధ అంశాల్లో విజేతలుగా నిలిచిన  వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజా గ్రంథాలయ కమిటీ అధ్యక్షుడు వంగ రవీందర్, కోశాధికారి లక్ష్మయ్య, ముల్కనూరు సాహితీ పీఠం కమిటీ ప్రతినిధులు, పలువురు కవులు రచయితలు విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

చిలుక సత్యం సాగర్ ని సన్మానించిన బీసీ సమాజ్.. చిలుక సత్యం సాగర్ ని సన్మానించిన బీసీ సమాజ్..
మేడ్చల్, తెలంగాణ ముచ్చట్లు: జాతీయ మానవ హక్కులు మరియు సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్  ఎన్నికైన సందర్భంగా మంగళ...
జాతీయ మానవ హక్కులు , సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్
బిగ్ యూత్ అసోసియేషన్ పలహార బండి ఊరేగింపు 
కాంగ్రెస్ ప్రభుత్వం కపట ప్రేమతో బిసి రిజర్వేషన్ నిరసనలు  
క్రీడాకారుల కోచ్ లకు ప్రోత్సాహం అందించండి బొంతు శ్రీదేవి యాదవ్
ప్రపంచ శాంతి సంఘం ఆధ్వర్యంలో హీరోషిమా డే సామ్రాజ్యవాద వ్యతిరేక దినోత్సవం
పాత‌ కూర‌గాయ‌ల మార్కెట్‌కు రూ.55 ల‌క్ష‌ల నిధులు నిధులు మంజూరు