కాంగ్రెస్ ప్రభుత్వం కపట ప్రేమతో బిసి రిజర్వేషన్ నిరసనలు  

రాళ్ల కృష్ణయ్య బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఘనపూర్

కాంగ్రెస్ ప్రభుత్వం కపట ప్రేమతో బిసి రిజర్వేషన్ నిరసనలు  

వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:

 బీసీలకు 42% రిజర్వేషన్ సాధిస్తామని ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం కపట నాటకాలు ఆడకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించి బిల్లుతో తిరిగి హైదరాబాద్ రావాలని ఘనపూర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ వెళ్లిన పెద్దలను ఒక తెలంగాణ బిసి బిడ్డగా కోరుతున్నాము. తెలంగాణలో 52 శాతం ఉన్న బీసీ జనాభాను దుర్మార్గంగా బీసీలపై అక్కసుతో తప్పుడు సర్వేలతో, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతానికి కుదించడం జరిగింది. కనీసం ఆ 42 శాతాన్ని అయినా ఢిల్లీ నుంచి సాధించుకొని తిరిగి రావాలని కోరుతున్నాము  . తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 1600 మంది ప్రాణత్యాగాలు చేసి ఢిల్లీలో సైతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డి లాంటి అమరులను కన్న తెలంగాణ గడ్డ నుంచి ప్రస్తుతం బీసీ బిల్లు కోసం మీరు ఢిల్లీకి వెళ్లారు. అందరి త్యాగాలు చూసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం గౌ,, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు తొమ్మిది రోజులు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఎంతోమంది తెలంగాణ బిడ్డలు ఆత్మహత్య చేసుకున్న తరుణంలో కేసీఆర్ తన ప్రాణాన్ని కూడా లెక్కచేయకుండా నిరాహార దీక్ష చేయడంతో అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గా ప్రకటించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్ర నాయకుల ఒత్తిడికి లోనై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవడం జరిగింది. అయినా కేసీఆర్  ఉద్యమాన్ని మొక్కవోని పట్టుదలతో తెలంగాణ కు అనుకూలమైన రాజకీయ పార్టీలతో జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి కేంద్రంలో ఉన్న జాతీయ పార్టీలను ఇతర రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలను ఒప్పించడం జరిగింది. అదే పట్టుదలతో కేసీఆర్  ఢిల్లీ వెళ్లేటప్పుడు ఢిల్లీ నుంచి తిరిగి తెలంగాణ వచ్చుడో-లేక కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో ఢిల్లీ వెళ్లి తెలంగాణ  ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఆమోద ముద్రతో గల లేకతో హైదరాబాద్ తిరిగి రావడం జరిగింది. ఢిల్లీ నే గడగడలాడించిన తెలంగాణ గడ్డ నుంచి బిసి రిజర్వేషన్ కోసం వెళ్లిన నాయకులు అంతమందిలో ఒక్కరికైనా నిజమైన పట్టుదల బీసీలపై మమకారం బీసీలపై ప్రేమ గౌరవం అభిమానం ఉన్న నాయకుడు ఏ ఒక్కడు ఉన్న నిజమైన బీసీల నాయకులుగా బీసీల రిజర్వేషన్ బిల్లుతో తిరిగి తెలంగాణకు రావాలి. ఇదేది కాకుండా ఇంకా బీసీలను మోసం చేయడం కోసం రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో జంతర్ మంతర్ యాక్షన్ చేసి కాలయాపన చేసి ఎలాంటి సాధన లేకుండా తిరిగి తెలంగాణకు సాధించే శక్తి లేని అసమర్థులుగా తిరిగి రాకుండా బీసీ బిల్లు సాధించుకుని తిరిగి రావాలని తెలంగాణ బిడ్డగా తెలియజేస్తున్నాను అని ఘనపూర్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య ఒక ప్రకటన తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

చిలుక సత్యం సాగర్ ని సన్మానించిన బీసీ సమాజ్.. చిలుక సత్యం సాగర్ ని సన్మానించిన బీసీ సమాజ్..
మేడ్చల్, తెలంగాణ ముచ్చట్లు: జాతీయ మానవ హక్కులు మరియు సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్  ఎన్నికైన సందర్భంగా మంగళ...
జాతీయ మానవ హక్కులు , సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్
బిగ్ యూత్ అసోసియేషన్ పలహార బండి ఊరేగింపు 
కాంగ్రెస్ ప్రభుత్వం కపట ప్రేమతో బిసి రిజర్వేషన్ నిరసనలు  
క్రీడాకారుల కోచ్ లకు ప్రోత్సాహం అందించండి బొంతు శ్రీదేవి యాదవ్
ప్రపంచ శాంతి సంఘం ఆధ్వర్యంలో హీరోషిమా డే సామ్రాజ్యవాద వ్యతిరేక దినోత్సవం
పాత‌ కూర‌గాయ‌ల మార్కెట్‌కు రూ.55 ల‌క్ష‌ల నిధులు నిధులు మంజూరు