ఈవెంట్ సంస్థకు వెళ్తున్నానన్నాడు… తిరిగి రాలేదు
కుషాయిగూడ పరిధిలో ఓ వ్యక్తి అదృశ్యం
కాప్రా, తెలంగాణ ముచ్చట్లు:
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...సైనికపురి సాయిపురి కాలనీలో నివాసముండే రేణుకుంట దుర్గా ప్రసాద్ (వయసు: 36), ఈవెంట్ నిర్వాహకుడిగా పని చేస్తున్నారు. జూలై 25న శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో “కాచిగూడలో ఉన్న ఆర్ డి ప్రో ఈవెంట్స్‌కి వెళ్తున్నా”ని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు.
అయితే అతను తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు జిపిఎస్ ద్వారా అతని ఫోన్ లొకేషన్ ట్రేస్ చేశారు. లొకేషన్ ప్రకారం అతడు చివరిసారిగా హైటెక్ సిటీ సమీపంలోని దుర్గం చెరువు వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడకు వెళ్లి గాలించినా అతని ఆచూకీ లభించలేదు.అపహరణ లేదా ఇతర కారణాలు అన్నది స్పష్టంగా తెలియకపోయినా, కుటుంబ సభ్యులు, బంధువులు పలుచోట్ల వెతికినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దీంతో దుర్గాప్రసాద్ సోదరుడు రేణుకుంట సాయి నరేష్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments