సింగారం గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

ముఖ్యఅతిథులుగా హాజరైన ఎంపీ వద్దీరాజు,మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య 

సింగారం గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

బయ్యారం, తెలంగాణ ముచ్చట్లు:

ఇల్లందు నియోజకవర్గంలోని బయ్యారం మండలానికి చెందిన సింగారం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు.శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ...సమానత్వానికి ప్రతీకగా నిలిచిన అంబేద్కర్ ఆశయాలను యువత అనుసరించాలని, గ్రామాలలో సామాజిక చైతన్యం బలపడాలని ఆకాంక్షించారు.ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యుడు వద్ధిరాజు రవిచంద్ర, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, ఇల్లందు మాజీ శాసన సభ్యురాలు బానోత్ హరిప్రియ, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అంగోత్ బిందు,అదేవిధంగా బయ్యారం మండల అధ్యక్షుడు తాత గణేష్, మండల ఉపాధ్యక్షుడు ఏనుగుల ఐలయ్య, మురళికృష్ణ, గంగుల సత్యనారాయణ, కొండల్ శ్రీను, శోభన్ నాయక్, దావా శ్రీకాంత్, కంబాల లెనిన్, కీర్తి ఉదయ్, సతీష్ నాయక్, వీరన్న తదితరులు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .