ప్రతి కాలనీ అభివృద్ధే లక్ష్యం – ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్ నగర్:
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో 166 మంది మున్సిపల్ కార్మికులకు ఉచితంగా కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు అనంతరం 9వ వార్డులోని మల్లికార్జున్ కాలనీలో పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ —
“ప్రతి కాలనీ అభివృద్ధే మా ధ్యేయం. ప్రజలకు మౌలిక సదుపాయాలు, శుభ్రత, మంచినీటి సరఫరా, డ్రైనేజ్ వ్యవస్థ, సీసీ రోడ్లు వంటి అంశాల్లో ఎటువంటి లోటుపాటులుండకుండా చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే ఎన్నికల నాటికి అన్ని వార్డుల అభివృద్ధి పూర్తయ్యేలా కార్యచరణ రూపొందించాం” అని తెలిపారు.
దసరా పండుగ పురస్కరించుకొని మున్సిపల్ కార్మికులకు ₹2500 బోనస్‌ను ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సునీత, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బాబర్ అలీ ఖాన్, పట్టణ అధ్యక్షుడు కొంకళ్ళ చెన్నయ్య, నేతలు అగ్గనూర్ బస్వం, చెంది తిరుపతి రెడ్డి, రఘు నాయక్, వెంకట్ రాం రెడ్డి, మహ్మద్ ఇబ్రహీం, అందే మోహన్ ముదిరాజ్, శ్రీనివాస్, శ్రీనివాస్ యాదవ్, ఖదీర్, వాసు, నల్లమోని శ్రీధర్, అర్జున్ లక్షన్, బాల గంగాధర్ తిలక్, కొప్పునూరి ప్రవీణ్, సాయి వంశీ, జయప్రకాశ్, శ్రీశైలం గౌడ్, రాజేష్ గౌడ్, మాధువలు యాదవ్, దిలీప్, గణేష్ రాథోడ్, శ్రీనివాస్, జగన్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రాజేష్ ముదిరాజ్, ప్రదీప్ ముదిరాజ్ తదితరులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
Comments