విలువలతో కూడిన జర్నలిజం మాత్రమే చేయాలి

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి

విలువలతో కూడిన జర్నలిజం మాత్రమే చేయాలి

వరంగల్,తెలంగాణ ముచ్చట్లు

పాత్రికేయులు సామాజిక బాధ్యతతో విలువలతో కూడిన జర్నలిజాన్ని మాత్రమే చేయాలని తద్వార సమాజంలో ప్రజల ఆదరణ పొందుతామని 
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్నారు.వరంగల్ పట్టణంలోని ఉర్స్ కరీమాబాద్ తాళ్ల పద్మావతి ఇంటర్నేషనల్ స్కూల్లో తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్ జిల్లా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు  రెండు రోజులపాటు నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల కార్యక్రమానికి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై  ప్రారంభించారు.

ఈ సందర్భంగా  శ్రీనివాసరెడ్డి  "నైతిక నియమాలు - మీడియా చట్టాలు" అనే అంశంపై  మాట్లాడుతూ మీడియా అకాడమీ నిర్వహిస్తున్న  పాత్రికేయుల శిక్షణ తరగతుల వల్ల మరింత జ్ఞానాన్ని పెంచుకునే అవకాశం ఉంటుందని  అన్నారు.వార్తల సేకరణలో సామాజిక ప్రభావం వంటి అంశాలు పూర్తిగా కొత్త రూపం దాల్చాయని తెలిపారు.  ప్రస్తుతం డిజిటల్ మీడియా రంగంలో వేగంగా వార్తల సేకరణ సులభం అవుతుందని అన్నారు.   మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిస్టులకు కావలసిన శిక్షణ ఇవ్వడానికి మీడియా అకాడమీ అన్ని చర్యలను చేపట్టి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు .

పాత్రికేయులు నైతిక విలువలు కాపాడుకోవడంతోపాటు పారదర్శకతతో కూడిన వార్తలను ప్రచూరించినప్పుడే ప్రజల్లో పాత్రికేయులపై గౌరవం పెరుగుతుందన్నారు. జర్నలిస్టులు నైతిక ప్రమాణాలు పాటించాలని అన్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆవిర్భావం, వర్కింగ్ జర్నలిస్ట్.. నాన్ వర్కింగ్ జర్నలిస్ట్ తదితర అంశాలపై ఆయన విపులంగా తెలియజేశారు. భవిష్యత్తులో పత్రిక నిర్వహణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధాన పాత్ర పోషించబోతుందని, తదనుగుణంగా రాబోవు కాలంలో జర్నలిస్టులకు టెక్నాలజీ, ఫ్యాక్ట్ చెక్ వంటి టెక్నికల్ అంశాలతో కూడిన తరగతులను మీడియా అకాడమీ తరఫున నిర్వహిస్తామని అన్నారు. 

ప్రముఖ సంపాదకులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ జర్నలిజం గతం, వర్తమానం, భవిష్యత్తు-  మీడియా , ధోరణులు ఆధునిక యుగంలో మీడియాలో వస్తున్న మార్పుల గురించి వివరించారు.  సోషల్ మీడియా యూట్యూబ్ లో వస్తున్న వార్తలు క్షణాల్లో ప్రజల్లో వెళ్తున్నాయని తెలిపారు.

సీనియర్ జర్నలిస్ట్, బ్యూరో ఆఫ్ నెట్వర్క్ వెలుగు ఇంచార్జ్ చిల్ల మల్లేశం భాష, తప్పొప్పులు, దిద్దుబాట్లపై జర్నలిస్టులకు కూలంకషంగా వివరించారు.ఆయా రిపోర్టర్లు వార్తలను డెస్క్ కు పంపించే సమయంలో వాడుక భాషలో మాత్రమే వార్తలను పంపాలని, అవసరంలేని సాహిత్య పదజాలం, అర్థం కాని తెలుగు పదాలను వార్తలలో ఉపయోగించకూడదని అన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ దిలీప్ రెడ్డి సమాచార హక్కు చట్టం 2005 గురించి సమగ్రంగా వివరించి జర్నలిస్టుల సందేహాలను నివృత్తి చేశారు.ఈ కార్యక్రమం లో  మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర రావు,టియుడబ్ల్యూజే (ఐ జె యు) అద్యక్షులు శ్రీ రామ్ రామ్ చందర్ ప్రధాన కార్యదర్శి మట్టదుర్గా ప్రసాద్ తాళ్ళ పద్మావతి విద్యాసంస్థల డైరెక్టర్ డా.వరుణ్,డిపిఆర్ఓ  ఆయుబ్ అలీ, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

చిలుక సత్యం సాగర్ ని సన్మానించిన బీసీ సమాజ్.. చిలుక సత్యం సాగర్ ని సన్మానించిన బీసీ సమాజ్..
మేడ్చల్, తెలంగాణ ముచ్చట్లు: జాతీయ మానవ హక్కులు మరియు సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్  ఎన్నికైన సందర్భంగా మంగళ...
జాతీయ మానవ హక్కులు , సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్
బిగ్ యూత్ అసోసియేషన్ పలహార బండి ఊరేగింపు 
కాంగ్రెస్ ప్రభుత్వం కపట ప్రేమతో బిసి రిజర్వేషన్ నిరసనలు  
క్రీడాకారుల కోచ్ లకు ప్రోత్సాహం అందించండి బొంతు శ్రీదేవి యాదవ్
ప్రపంచ శాంతి సంఘం ఆధ్వర్యంలో హీరోషిమా డే సామ్రాజ్యవాద వ్యతిరేక దినోత్సవం
పాత‌ కూర‌గాయ‌ల మార్కెట్‌కు రూ.55 ల‌క్ష‌ల నిధులు నిధులు మంజూరు