కాంగ్రెస్ ప్రభుత్వం లోనే జర్నలిస్టుల సంక్షేమం!
ప్రభుత్వం ఏర్పాటు లో జర్నలిస్టుల భాగస్వామ్యం అభినందనీయం.
సత్తుపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జర్నలిస్టుల సంక్షేమం సాధ్యపడుతుందని సత్తుపల్లి నియోజకవర్గం శాసన సభ్యులు డాక్టర్ మట్టా రాగమయి పేర్కొన్నారు.
గురువారం, ఖమ్మం జిల్లా, వైరా పట్టణంలో శబరి గార్డెన్ లో నిర్వహించిన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా మహాసభలో మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు లో జర్నలిస్టుల భాగస్వామ్యం అభినందనీయమని కొనియాడారు. గత ప్రభుత్వం జర్నలిస్టుల సేవలను వినియోగించుకొని ఓడ దాటిన తర్వాత బోడ మల్లయ్య సామెతల వ్యవహరించిందన్నారు. సమాచార శాఖ మంత్రి కూడా మన జిల్లా వాస్తవ్యులే కాబట్టి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో శ్రద్ధ తీసుకుంటాం అని తెలిపారు.
సత్తుపల్లి జర్నలిస్టుల సంక్షేమాన్ని కోరుతూ ఏడాదికి ఐదు లక్షల చొప్పున బ్యాంక్ డిపాజిట్ చేస్తున్నట్లుగా తెలిపారు. తద్వారా వచ్చిన వడ్డీతో పిల్లల చదువులు ఇతరత్రా కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంది అని, ఇండ్లు, ఇండ్ల స్థలాల విషయాల్లో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని, అర్హులైన జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. సుదీర్ఘకాలంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇస్తున్న చరిత్ర మాకే ఉంది అని తెలిపారు. సత్తుపల్లి మండలం జర్నలిస్టులు మట్టా కుటుంబ సబ్యులు అని కొనియాడారు. వాళ్ల సంక్షేమం విషయంలో ఎక్కడా వెనుకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు.
Comments