కేటీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకొస్తుంది

మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఖమ్మం నగర అధ్యక్షులు పగడాల నాగరాజు

కేటీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకొస్తుంది

  బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు, రక్తధానం శిభిరం

ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

తెలంగాణ ఐకాన్, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకొస్తుందని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఖమ్మం నగర అధ్యక్షులు పగడాల నాగరాజు లు అన్నారు. ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ నందు ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ నాయకత్వంలో గురువారం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐకాన్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి యువనేత కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యఅతిధులు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఆర్.జె.సి కృష్ణ, కూరాకుల నాగభూషణం, ఉప్పల వెంకటరమణ, బొమ్మెర రామ్మూర్తి, బి రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం పార్టీ ఖమ్మం నగర అధ్యక్షులు పగడాల నాగరాజు ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు, తెలంగాణ ఉద్యమకారులు, కార్యకర్తలతో కలిసి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేశారు. ఈ రక్తదాన శిభిరంలో 60మందికి పైగా రక్తధానం చేశారు. కేక్ కటింగ్, రక్తదానం అనంతరం లాంగ్ లీవ్ కేటీఆర్ అంటూ.. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ..  తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా, అదేవిదంగా ఖమ్మం జిల్లాలో సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమైన విషయమన్నారు. కేటీఆర్ అధికారంలో ఉన్నా, లేకున్నా తన పుట్టినరోజు సందర్భంగా "గిఫ్ట్ ఏ స్మైల్" కార్యక్రమం ద్వారా సామాజిక సేవలో భాగంగా విద్యార్థులకు లాప్టాప్ లు, ఫీజులు, ప్రభుత్వ ఆసుపత్రులకు అంబులెన్సులు, వికలాంగులకు వాహనాలు అందిస్తున్నారని తెలిపారు. 

తెలంగాణ ప్రగతిలో భాగంగా కేటీఆర్ కృషి వల్ల రాష్ట్రంలో ఐటీ రంగాన్ని విస్తృతంగా ఏర్పాటు చేయడంతోనే లక్షలాదిగా ప్రైవేటు ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు కల్పించబడ్డాయన్నారు. సామాజిక సేవలో నిత్యం ముందుండే కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలంటూ.. కేటీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ రాబోయే స్థానిక ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారం చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ ఆంధ్ర సొసైటీ బ్యాంక్ చైర్మన్ బి రెడ్డి నాగచంద్ర రెడ్డి, మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ ఖమర్, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు తాజుద్దీన్, బిచ్చాల తిరుమలరావు, ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, రఘునాధపాలెం మండలం అధ్యక్షుడు వీరు నాయక్, తిరుమలాయపాలెం మండల అధ్యక్షులు భాషబోయిన వీరన్న, పిన్ని కోటేశ్వరరావు, కార్పొరేటర్లు శీలంశెట్టి వీరభద్రం, దండా జ్యోతి రెడ్డి, కూరాకుల వలరాజు, శ్రీవిద్య, బత్తుల మురళి, మాజీ ముదిగొండ మండల జడ్పీటీసీ సామినేని హరిప్రసాద్, WhatsApp Image 2025-07-24 at 9.29.06 PMమహిళా నాయకురాలు భారతి, కొల్లు పద్మ, నాయకులు ముత్యాల వెంకటప్పారావు, బంక మల్లన్న, శంకర్, బిక్షం, ఇంటూరి శేఖర్, మెంటం రామారావు, మీగడ శ్రీనివాస్ యాదవ్, పగడాల నరేందర్, లింగనబోయిన సతీష్, బలుసు మురళీకృష్ణ, మహమ్మద్ రసూల్, సద్దాం షేక్, మద్దెల విజయ్, మాటేటి కిరణ్, చీకటి రాంబాబు, షారుక్, ఆసిఫ్, అప్సర్, బురాన్, ఆరెంపుల వీరభద్రం, ఉస్మాన్, మన్సూర్, నెమలికొండ వంశీ,‌ నెమలి కిషోర్, నారమళ్ళ వెంకన్న, ఎల్వీ రత్నం, షకీన, శైలజా, మాధవి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

చిలుక సత్యం సాగర్ ని సన్మానించిన బీసీ సమాజ్.. చిలుక సత్యం సాగర్ ని సన్మానించిన బీసీ సమాజ్..
మేడ్చల్, తెలంగాణ ముచ్చట్లు: జాతీయ మానవ హక్కులు మరియు సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్  ఎన్నికైన సందర్భంగా మంగళ...
జాతీయ మానవ హక్కులు , సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్
బిగ్ యూత్ అసోసియేషన్ పలహార బండి ఊరేగింపు 
కాంగ్రెస్ ప్రభుత్వం కపట ప్రేమతో బిసి రిజర్వేషన్ నిరసనలు  
క్రీడాకారుల కోచ్ లకు ప్రోత్సాహం అందించండి బొంతు శ్రీదేవి యాదవ్
ప్రపంచ శాంతి సంఘం ఆధ్వర్యంలో హీరోషిమా డే సామ్రాజ్యవాద వ్యతిరేక దినోత్సవం
పాత‌ కూర‌గాయ‌ల మార్కెట్‌కు రూ.55 ల‌క్ష‌ల నిధులు నిధులు మంజూరు