చిన్నారుల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు తల్లిపాలు ఉపయోగపడతాయి
గర్భిణీలు, బాలింతలు, మహిళలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన
- ఐసిడిఎస్ సూపర్వైజర్ సుధా
వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:
పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలోని అంగన్వాడి కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఐసిడిఎస్ సూపర్వైజర్ సుధా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా పామిరెడ్డిపల్లి గ్రామంలోని 1వ,2వ అంగన్వాడి కేంద్రాలలో గర్భిణీలు బాలింతలు మహిళలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ సుధా మాట్లాడుతూ.. చిన్నారుల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు తల్లిపాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. తల్లిపాలలో గల పోషకాల గురించి వివరిస్తూ.. ఆకుకూరలు, పాలు, పండ్లు, గుడ్లు, పౌష్టిక ఆహారం గురించి మహిళలకు అవగాహన కల్పించారు. తమ పిల్లల క్షేమం కోసం అంగన్వాడి కేంద్రాల్లో పోష్టికాహారం అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు అంగన్వాడి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సుధా, ఏఎన్ఎం కౌసల్య, అంగన్వాడి టీచర్లు లక్ష్మి, సునీత, పంచాయతీ కార్యదర్శి స్రవంతి, ఆశ వర్కర్లు చిన్నారులు, మహిళలు పాల్గొన్నారు.
Comments