మీనాక్షి నటరాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు గట్టు రాజు
వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:
ఢిల్లీలో నిర్వహించనున్న బీసీ రిజర్వేషన్ ధర్నా కార్యక్రమానికి హాజరయ్యేందుకు రైలు మార్గం లో వెళ్తున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ను అదే బోగీలో ప్రయాణిస్తున్న పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు మర్యాదపూర్వకంగా కలిసి వారితో ప్రస్తుత రాజకీయ అంశాల గురించి మాట్లాడడం జరిగింది .స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీకి మొదటి నుంచి కష్టపడుతున్న కార్యకర్తలకు ప్రథమ స్థానం కల్పించాలని వారికి విన్నవించుకోవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.గట్టు రాజు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదట కులగణన చేసి అట్టి బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలుపగా కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ బిల్లును ఆమోదించి షెడ్యూల్ 9 లో చేర్చి చట్టబద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ కాలం గడుపుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,తెలంగాణ పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, కేంద్ర ప్రభుత్వాన్ని కి కనువిప్పు కలిగించి బీసీల చిరకాల ఆకాంక్ష నెరవేర్చాలని చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. చలో ఢిల్లీ కార్యక్రమానికి మద్దతుగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ఆదేశానుసారం వనపర్తి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఢిల్లీలో జరిగే మహాధర్నకు బయలుదేరడం జరిగింది అని తెలిపారు.
Comments