కొప్పూరు - కొత్తపల్లి బ్రిడ్జిని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్
Views: 1
On
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరు నుండి కొత్తపల్లి రోడ్డు వరకు రూ. 329 లక్షల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిని రాష్ట్ర రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, స్థానిక తహసిల్దార్ రాజేష్, ఎంపీడీవో వీరేశం, పంచాయతీరాజ్ అధికారులతో పాటు స్థానిక నాయకులతో కలిసి కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాన్ని ఆవిష్కరించి బ్రిడ్జిని ప్రారంభించారు. అదేవిధంగా కొత్తకొండలోని శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం వద్ద త్రిశూలం చౌరస్తా కు మంత్రి పొన్నం ప్రభాకర్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం ఆలయంలో శ్రీ వీరభద్ర స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
06 Aug 2025 22:38:26
మేడ్చల్, తెలంగాణ ముచ్చట్లు:
జాతీయ మానవ హక్కులు మరియు సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్ ఎన్నికైన సందర్భంగా మంగళ...
Comments