సిహెచ్ సి ఆస్పత్రిని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
హనుమకొండ: ,తెలంగాణ ముచ్చట్లు:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని సిహెచ్సి ఆసుపత్రిని జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపి సేవలు, ఆస్పత్రికి సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను వైద్యులు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వార్డులో చికిత్స పొందుతున్న పేషంట్లతో వైద్య సదుపాయాలను అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి వైద్య సేవలు నిమిత్తం వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి సూచించారు.ఈ సందర్భంగా సిహెచ్సి ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
కమలాపూర్ తహసీల్దార్ కార్యాలయం సందర్శన
కమలాపూర్ లోని తహసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి సందర్శించారు. కార్యాలయంలో భూభారతి దరఖాస్తులను ఆన్లైన్ చేస్తుండగా ఆ ప్రక్రియను పరిశీలించి వాటి వివరాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Comments