మతిస్థిమితం లేని స్నేహితుడికి చేయూత.

రేహాబిటేషన్ సెంటర్ లో చేర్చిన మిత్రులు.

మతిస్థిమితం లేని స్నేహితుడికి చేయూత.

హసన్ పర్తి, తెలంగాణ ముచ్చట్లు:

హసన్ పర్తి మండల కేంద్రానికి చెందిన వెంగళ దాసు రమేష్ కొన్నేళ్లుగా మతిస్థిమితం లేకుండా ఉన్న స్థితిని గ్రహించిన పదవ తరగతి మిత్రులు ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా రమేష్ ను హనుమకొండలోని రిహాబిటేషన్ సెంటర్  లో చేర్చి స్నేహం గొప్పతనాన్ని చాటుకున్నారు.
 హసన్ పర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో 1989-90 10వ తరగతి బ్యాచ్ కి చెందిన వెంగళదాసు రమేష్ తన కుటుంబ పరిస్థితుల వలన కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయి హసన్ పర్తి స్మశాన వాటికలో జీవితం గడుపుతున్నాడు. స్మశానంలో కార్యక్రమాలకు వచ్చిన వారు తెచ్చిన ఆహార, పానీయాలని నిత్యం స్వీకరిస్తూ, స్మశానం లోనే నిద్రిస్తూ జీవితం గడుపుతున్నాడు. వెంగళదాస్ రమేష్ మిత్రులైన 10వ తరగతి బ్యాచ్ కి చెందిన స్నేహితులు ఆదివారం స్నేహితుల దినోత్సవం ను పురస్కరించుకొని మిత్రులందరు రమేష్ కు కటింగ్,స్నానం చేయించి అనంతరం రెండు జతల బట్టలను అందించి రమేష్ తో కలిసి సహా పంక్తి భోజనం చేయడంతో మిత్రుల గొప్పతనాన్ని చాటుకున్నారు.  పదవ తరగతి గ్రూపు కుటుంబ సభ్యుల సూచనలతో తోటి మిత్రులైన కడార్ల పరమేశ్వర చారి, ఎలుక రాజు సదానందం, దండుగూడెం రాజ్ కుమార్, గుడికందుల సురేష్,ఆరెల్లి వెంకటస్వామి, సయ్యద్ అహ్మద్, మట్టెడ సురేందర్, బోనగాని రమేష్ గౌడ్ లతో హన్మకొండలోని హెల్పింగ్ హ్యాండ్ రీహబిటేషన్ సెంటర్ లో చేర్పించారు. అదే సెంటర్లో అధిక మద్యం సేవించి, మత్తు పానీయాలకు అలవాటు పడిన వారితో  కలిసి ఫ్రెండ్షిప్ డే కేక్ కట్ చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .