మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు మరో అడుగు
భూసేకరణకు 205 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
Views: 1
On
వరంగల్,తెలంగాణ ముచ్చట్లు:
వరంగల్ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 205 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య స్పందిస్తూ, మామునూరులో విమానాశ్రయ నిర్మాణానికి ఇది కీలక ముందడుగుగా పేర్కొన్నారు.
సాంకేతికంగా అడ్డంకిగా మారిన 150 కిలోమీటర్ల పరిమితిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి ఇప్పటికే అనుమతులు పొందిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. నిధుల విడుదలతో రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయ నిర్మాణం పట్ల చూపిన నిబద్ధతను మరోసారి స్పష్టంగా తెలిపినట్టు అభిప్రాయపడ్డారు.
చారిత్రక ప్రాధాన్యం కలిగిన వరంగల్ నగర అభివృద్ధిలో విమానాశ్రయం నిర్మాణం ఒక కీలక మైలురాయిగా నిలవనుందని అన్నారు. ఈ ప్రాజెక్టుపై కేంద్ర విమానయాన శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
06 Aug 2025 22:38:26
మేడ్చల్, తెలంగాణ ముచ్చట్లు:
జాతీయ మానవ హక్కులు మరియు సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్ ఎన్నికైన సందర్భంగా మంగళ...
Comments