బిఆర్ఎస్వి రాష్ట్రస్థాయి సదస్సులో పాల్గొన్న హరీశ్ రావు,బండారి లక్ష్మారెడ్డి
కాప్రా, తెలంగాణ ముచ్చట్లు
ఉప్పల్ నియోజకవర్గంలో నిర్వహించిన బిఆర్ఎస్వి రాష్ట్రస్థాయి సదస్సులో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు,ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవ్వరికీ జై తెలంగాణ అనలేని వ్యక్తిగా అభివర్ణిస్తూ, “జై సోనియా, జై డిల్లీ, జై మోదీ” అనే వాడిగా విమర్శించారు.తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలా నాయకులు రాజీనామా చేయకుండా పారిపోయారని ఆరోపించారు. సభలలో కేసీఆర్ పేరును తలుచుకోకుండా రేవంత్ రెడ్డి మాట్లాడే పరిస్థితి లేదన్నారు.
తెలంగాణ ద్రోహుల చరిత్రలో మొదటి పేరు చంద్రబాబు, రెండవది రేవంత్ అనేలా పరిస్థితి ఉందని, పోరాటాల చరిత్రలో కెసిఆర్ నాయకత్వం గురించి మరిచిపోవడం సమాజానికి చేటు అని పేర్కొన్నారు. పుస్తకాల్లో కేసీఆర్ పేరును తొలగించడమే కాకుండా, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం, బతుకమ్మ పండుగను అణచివేయడం, అంబేద్కర్ విగ్రహానికి విలువ ఇవ్వకపోవడం తెలంగాణ సంస్కృతి పట్ల అపహాస్యమని విమర్శించారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రను మరుగున పడేయాలన్న కుట్రలు జరుగుతున్నాయని, యువతతోనే అన్ని ఉద్యమాలు ప్రారంభమవుతాయని, కెసిఆర్ నాయకత్వంలో ఎంతోమంది యువతకు రాజకీయాల్లో స్థానం లభించిందని గుర్తు చేశారు. కేసీఆర్ విజన్‌తో రాష్ట్రం అభివృద్ధి దిశగా నడిచిందని, నీళ్ళు, నిధులు, నియామకాల విషయంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు.
ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ కలిసి తెలంగాణపై నీటి దోపిడీ కుట్రలు చేస్తున్నాయని, ప్రజలు ఈ కుట్రలను గుర్తించి విరుచుకుపడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
Comments