విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
నారాయణ జూనియర్ కాలేజీలో ఫాదర్స్ డే వేడుకలు
– ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
కాప్రా, తెలంగాణ ముచ్చట్లు:
విద్యార్థులు కృషితో అన్ని రంగాల్లో రాణించి, తల్లిదండ్రులకు, సమాజానికి గౌరవం తీసుకురావాలని ఉప్పల్ శాసనసభ్యుడు బండారి లక్ష్మారెడ్డి అన్నారు.చర్లపల్లి డివిజన్‌లోని చక్రిపురం శ్రీ కృష్ణ కన్వెన్షన్‌లో ఈసీఐఎల్ నారాయణ జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఫాదర్స్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థుల ఫీజు మొత్తాన్ని తానే భరిస్తానని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి దేశ అభివృద్ధిలో భాగస్వాములవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్‌చార్జి శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ వేణు కుమార్ రెడ్డి, డీన్ పవన్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు నేమూరి మహేష్ గౌడ్, బైరీ నవీన్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, శ్రీశైలం, ప్రసాద్ రెడ్డి, సురేష్ రెడ్డి, చిన్న తదితరులు పాల్గొన్నారు.
Comments