తండ్రినే మార్చేశారు కదా ..!

సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌‌లో ఘోర తప్పిదం

తండ్రినే మార్చేశారు కదా ..!

వేరొక వ్యక్తి వీర్యంతో ఐవీఎఫ్ 

డిఎన్ఏ టెస్ట్ తో నిజం బట్టబయలు 

పోలీసులకు ఓ మహిళ పిర్యాదు 

 కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు 

సికింద్రాబాద్,తెలంగాణ ముచ్చట్లు‌: 


సికింద్రాబాద్‌లోని టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌లో పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. పిల్లల కోసం టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ను ఓ మహిళ ఆశ్రయించారు. తన భర్త వీర్య కణాలతో సంతానం కలిగించాలని ఆమె కోరారు. వేరే వారి వీర్యకణాలతో సంతానం కలిగించారు వైద్యురాలు. అనుమానం వచ్చి డీఎన్‌ఏ టెస్ట్‌ చేయించారు దంపతులు. కడుపులో ఉన్న శిశువు డీఎన్‌ఏ వేరే వారిదిగా తేలడంతో పోలీసులను ఆశ్రయించారు దంపతులు. వారి ఫిర్యాదు మేరకు సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం వచ్చిన దంపతులకు మగ బిడ్డ జన్మించింది. బిడ్డ ఎదుగుతున్న కొద్దీ అనారోగ్య సమస్యలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితమే పుట్టిన బాబుకి కేన్సర్ అని తేలడంతో దంపతులు షాక్‌కి గురయ్యారు. ఈ విషయం తెలియడంతో వెంటనే మరో డాక్టర్‌ను కలిశారు దంపతులు. డీఎన్‌ఏ టెస్ట్ చేయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే తొమ్మిదేళ్ల క్రితం సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను సీజ్ చేశారు. అక్రమంగా అనుమతులు పొంది.. మళ్లీ నిర్వహిస్తున్నారు డాక్టర్ నమ్రత. రెండు గంటలుగా రెవెన్యూ, పోలీస్, వైద్య శాఖల ఉన్నతాధికారులు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో తనిఖీలు చేస్తున్నారు. అక్రమంగా పెద్దఎత్తున వీర్యం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. కొంతమంది యువకులకు డబ్బు ఆశ చూపించి వీర్యం సేకరిస్తున్నారని అధికారులు గుర్తించారు. ఎవరైనా దంపతులు టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం వస్తేనే.. విజయవాడ నుంచి డాక్టర్ నమ్రత వస్తున్నారు. నమ్రతను విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కి టాస్క్‌ఫోర్స్ పోలీసులు తీసుకువచ్చి విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Tags:

Post Your Comments

Comments

Latest News

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన 
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
మీనాక్షి నటరాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు గట్టు రాజు 
భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి నందుకు కార్పొరేటర్ కు సంతోషం వ్యక్తం చేసిన కాలనీవాసులు. 
బోనాల పండుగ ఉత్సవాల లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
దమ్మాయిగూడ జాతీయ మాల మహానాడు సంఘం అధ్యక్షులుగా 
50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు బాబా సాహెబ్ సన్నిధిలో 
మల్లాపూర్ అంబేద్కర్ సంఘం బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న