పాలక సంస్థను వ్యక్తిగత ఆదేశాలకు వాడకూడదు
కార్పొరేటర్ మాధవరం రోజాదేవి అభ్యంతరం
-శంకుస్థాపన ఏర్పాట్లపై కార్పొరేటర్‌కు సమాచారం లేకపోవడంపై ఆగ్రహం
కూకట్‌పల్లి, తెలంగాణ ముచ్చట్లు:
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్ డివిజన్‌లో జీహెచ్ఎంసీ అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపన శిలాఫలకాల ఏర్పాటుపై స్థానిక కార్పొరేటర్ మాధవరం రోజాదేవి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సంబంధిత పనులపై కార్పొరేటర్‌కు ముందుగా సమాచారం ఇవ్వకుండా, పదవిలో లేని వ్యక్తుల సూచనల మేరకు అధికారులు నిర్ణయాలు తీసుకోవడాన్ని ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధమని ఆమె పేర్కొన్నారు.
ఇలాంటి చర్యలు ప్రజాప్రతినిధుల హక్కులను విస్మరించినట్లే కాకుండా, ప్రజల్లో సంస్థపై నమ్మకాన్ని తగ్గించే అవకాశముందని వ్యాఖ్యానించారు. గత 10 నెలలుగా అనుపమ బ్యాక్ సైడ్ సిమెంట్ రోడ్డు పనులు మంజూరై ఉన్నప్పటికీ, వాటిని కొనసాగించకుండా నిలిపివేయడం వలన వర్షాకాలంలో ఆ ప్రాంతంలో రెండు అడుగుల వరకూ నీరు నిలిచే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. దాంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
వేడేపల్లి ఎన్క్లేవ్ నుంచి మాధవరం నగర్ కాలనీ వరకు నిర్మించిన కల్వర్టు, రోడ్డు ప్రాంతంలో వీధి దీపాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ విషయాలన్నింటిపై జోనల్ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
Comments