వర్షాకాలంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి
ఎవరూ హెడ్ క్వార్టర్ ను విడిచి వెల్లకూడదు
-ఆగస్టు మొదటి వారంలో స్పెషల్ డ్రైవ్
-పీఆర్ఆర్డీ సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క
హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
గ్రామాల్లో పచ్చదనం స్వచ్చదనం పెంచేలా ఆగస్టు మొదటి వారంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డా.దనసరి అనసూయ సీతక్క ఆదేశాలు జారీ చేశారు. భారీవర్షాలతో గ్రామీణ రహదారులు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున..సత్వరమే పునురుద్దరణపనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిత్య పర్యవేక్షణ కోసం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం హెడ్ ఆఫీస్ లో డీఈ, ఎస్ఈ లతో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాడు సచివాలయంలో పీఆర్ ఆర్డీ శాఖపై మంత్రి సీతక్క జిల్లా అడిషనల్ కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, డీపీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్ధితులపై ఆరా తీశారు. రూరల్ డ్రికింగ్ వాటర్, సానిటేషన్, రూరల్ రోడ్స్, ప్లాంటేషన్ పై సమీక్ష నిర్వహించారు. వెగవంతం చేయాలని పేర్కొన్నారు. వనమహెత్సవంలో భాగంగా 2.44 కోట్ల మొక్కలు నాటినట్లు అధికారులు నివేదించగా ...వేగం పెంచాలని మంత్రి ఆదేశించారు.
Comments