ధర్మపురి కాలనీలోని సిసి రోడ్ పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్
బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్
చిల్కానగర్, తెలంగాణ ముచ్చట్లు:
చిల్కానగర్ డివిజన్ లో ని ధర్మపురి కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్ పనులను జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారుల తో కలిసి పర్యవేక్షించిన కార్పొరేటర్
జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ మాట్లాడుతూ జిహెచ్ఎంసి అధికారులు సిసి రోడ్ల నిర్మాణ సమయంలో తప్పనిసరిగా పర్యవేక్షణ ఉండాలని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్ణీత సమయంలో సిసి రోడ్డుకు కావలసిన క్యూరింగ్ ని అదే విధంగా సిసి రోడ్డు నిర్మాణ సమయంలో నాణ్యత ప్రమాణాలు తప్పకుండా పాటించే విధంగా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, కాలనీ అసోసియేషన్ సభ్యులు ప్రసాద్, భాస్కర్ గుప్త, అనిల్, గోపాల్ రెడ్డి, దర్శన్ రెడ్డి, రుమీ, సునీత, భువన, మాధవి మొదలగు వారు పాల్గొన్నారు.
Comments